కోరమీసం
పసిప్రాయపు చివరి అంకంలో పొడుచుకు వచ్చింది రోషంలా! పౌరుషానికి తానొక్కటే ప్రతీకలా! ఎదురు వచ్చిన యుక్తవయస్సులో ఎదిగింది ఏపుగా దర్భ గడ్డిపొదలా! మెలికల కసరత్తులు చేసి మిగిలింది వంపులు తిరిగిన మల్లయోధుడిలా! నల్లటి గుబురుపొదల మధ్య విరిసిన మగడి నవ్వు చూసి అమ్మడి గుండెల్లో సరస సరగాలు గుబులయ్యితే! సంపుటాల సంకుల సమరంలో, మెత్తటి అధరాలను…





