ఏక వర్ణ మై
సప్తరంగులు ప్రదర్శించె
సంఘంలో
తాము మసలుతున్న
సమయ సందర్భాలకు
అవి రసాలుగా
అవి విరసాలుగా
మారుతుంటాయి…
బతకడానికి
పూలరంగుల్లా
మాట్లాడాలి
అపుడపుడు
పక్షుల్లా కువకువలు పోవాలి
అపుడపుడు పాముల్లా బుసగొట్టాలి
ప్రకృతి లో తాము
ఒక జీవిగా జీవనం సాగిస్తున్నపుడు
వికృతి ధర్మాలు తరుము తుంటాయి
తట్టుకుని నిలబడ్డపుడే
మనిషికి మనుగడ
నిలబడక పోతే
మనిషి బతుకు బజారు పాలు…
సంఘంతో నడవాలి
సంఘంతో జతకట్టాలి
రేడియమ్
9291527757