ఆ పేజీని ఎంత పగులకొట్టినా
తెరచుకోవడం లేదు…
ఎన్నేళ్ళ నాటి కఠినాక్షరాలతో
ఏ భావాన్ని దాచి పెట్టారో..
అప్పుడప్పుడు
అర్థరాత్రి వేళలో చప్పుడు చేస్తాయి
చుట్టూ తిరిగి చూస్తే
దుమ్ముకొట్టుకున్న పాదముద్రల పక్కన
రాలిన రెండు చెమట చుక్కలు కనిపిస్తాయి.
కన్నీరే కందేనేగా కళ్ళు తిరిగిన ఆనవాళ్లు
తీరిక లేని వెతుకులాటలో మెతుకు ముట్టని
మునివేళ్ళ అలసట అగుపిస్తుంది.
ముందుమాట పైకెక్కి చూసినా
ఆ పేజీకి దారెక్కడో కనిపించలేదు.
.. చందలూరి నారాయణరావు
9704437347