నీ తూటాల్లాంటి మాటలతో
నన్ను చంపాలనుకుంటావు
నీ వాడి చూపుల చురకత్తులతో
నా దేహాన్ని గాయపరచాలనుకుంటావు
నీ విద్వేషాగ్నిలో నన్ను
నిలువునా దహించాలనుకుంటావు
నా కాళ్ళకు చేతులకు
అన్యాయం అని అరిచే నా గొంతుకకు
నీ అహంకారపు ఇనుప సంకెళ్లతో బందీనిచేసి
నన్ను కట్టడి చేసే కుట్రలో
నీవెన్ని అవరోధాలు సృష్టించినా
నేను మాత్రం స్వచ్ఛమైన గాలిలా
ఆకాశమే హద్దుగా ఎగిరే
ఫీనిక్స్ పక్షిలా సదా పైపైకి
అలా ఎగిసిపోతూనే ఉంటా !
( అమెరికన్ కవయిత్రి మాయా ఎంజిలో
కవిత ప్రేరణతో )
డా. కె. దివాకరా చారి
జవశ్రీశ్రీ: 9391018972