హేమంత శోభ
శిశిరంలో ప్రాతఃకాలాన వికసించు విరులు ప్రకృతిశోభను ద్విగుణీకృతం చేసి మదిని దోచే, ఆనందవిప్రుషములే తుషారబిందువులు. చేలగట్లు,పచ్చికబయళ్లపై వెలసిన ఈ తుహినబిందువులను బాలభానుని లేలేత కిరణాలు స్పృశించగా ముత్యాల్లా మెరుస్తున్న ఇంపైన దృశ్యం నేత్రపర్వమౌ. ప్రకృతిలోని అణువణువుని తమ జల్లులతో ఆవరిస్తూ, మదిని పులకరింపచేసే ఆ రమణీయదృశ్యం అనుభవైకవేద్యం. నింగినుండి విరిజల్లులా కురుస్తున్న ఆ హిమబిందువులు మేనుని…








