బువ్వ పెట్టిన భూమి

బువ్వ పెట్టిన భూమి
అమ్మ నాన్నలు కష్టం చేసిన నేల
ఆకలి తీర్చిన అవని

పసితనములో
బుడిబుడి నడకల పాదాల
అడుగు జాడల జ్ఞాపకాల మట్టి తల్లి

అరక పట్టి సాల్లుదొలి
అందులోఇత్తులు నాటినం
పంటలు తీసినం

కర్షకునై కారుస్తున్న రక్త చమట సుక్కలు
అప్పులు ఎన్ని ఉన్నా అవనిని నమ్ముకున్నాం
బాధలు ఎన్నున్నా బతుకుతున్నాం

తీరని అప్పుల కోసం
తీర్చడానికి తిప్పలు పడుతున్నాం
హలికుని పై ఆగడాలు

మనిషికి మన్నుకు
విడదీయని హృదయ బంధం
రైతుని రాజ్యాన గోస పడుతున్న

పచ్చని పంట పొలాల
ఫార్మ పాములు పగబట్టి
పడగలెత్తి కాటేస్తున్నాయి

వసుధ నీ ఒడిలోనే పంట మా ప్రాణ జీవం
నాటి ప్రభుత్వ పాలకులు పంచిండ్రు భూములు నేటి సర్కార్ పెద్ద భూముల గుంజుకుంటుండ్రు

సన్నవిల్లా తల్లుల గర్భిణీ స్త్రీల
భార్య భర్తల హింసించి బంధించి
ఇబ్బందులు పెట్టి
లాఠీల తూటాల లడాయి చేసి
ఫార్మసీ మాభూమి పంచుతున్నారు

దేవరపాగ కృష్ణయ్య
9963449579

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page