Category సాహిత్యం-శోభ

కవితాదాహం

కవిత్వం కవులకు కలిగేదాహం ఎప్పటికీ తీరనిదాఘం కవిత్వం మనసులతొలిచే కీటకం మదులలోపుట్టే ప్రకరణం కవిత్వం ఆలోచనల పర్యావసానం భావజ్వాల బహిర్గతరూపం కవిత్వం అక్షరాల అల్లకం పదాల పేర్చటం కవిత్వం పువ్వుల హారం పరిమళ ప్రసరణం కవిత్వం తియ్యని మకరందం వీనులకు విందుభోజనం కవిత్వం అనుభూతుల అక్షరాకారం అంతరంగాల ప్రతిస్పందనం కవిత్వం అందాల ప్రదర్శనం ఆనందాల కారకం…

‌పొదుపు

కూడికలు తీసివేతలు కాదు జీవితం అంటే భాగహారాలు గుణకారాలు కూడా ఉంటాయి ఏటిలో పుణ్యం కొరకు వేసె డబ్బును లెక్కపెట్టి పెద్దలు వేయ మన్నారు పుట్టుక నుండి చచ్చేదాక లెక్కాపత్రం ఉంటుంది లెక్కల్లో జాతక చక్రం ముడిపడి ఉంటుంది… నీరున్న తొట్టిలో నీరున్నంత వరకు తొట్టి కలకల లాడుతుంది నీరు తోడతుండాలి నింపుతు ఉండాలి అలానే…

‌జీవమున్న జ్ఞాపకం

మౌనమంటించిన మనసుచితిలో ఒక్క నిప్పురవ్వ బతుకులో రాలి గాలి కెరటాలకు పగటి లోతుకు చేరి కరిగిన క్షణాలది అక్షరాలా మరణమే. జీవమున్న జ్ఞాపకమే. నిలువెత్తు నిజాన్ని మింగేసిన ఆకాశంలో మిగిలిన శూన్యంతో పోరాడిన ప్రాణం గెలుచిన కన్నీళ్ళ ఈతకు ఊహకందడం లేదు ఒడ్డు. – చందలూరి నారాయ

ప్రజా పాటల సేనాని… సుద్దాల హనుమంతు

లక్ష్యాన్నే పదునైన ఆయుధంగా మలచుకొని, నిత్యచైతన్యాన్ని ఇంధనంగా మార్చుకొని ఎన్నెన్నో ఉద్విగ్న భరితమైన అగ్ని కణాల వంటి పాటలను వెలకట్టలేని నిధులుగా అందించిన కవి యోధుడు సుద్దాల హనుమంతు. పాడుకో వడానికి అనువుగా ఉండే పాటల్ని రాసి ప్రజలతో పాడిరచి ప్రజాస్వామ్య భావజాలాన్ని వారి హృదయాలలో నాట్లుగా వేసిన ధీశాలి. కవై, కళాకారుడై, జానపద నిర్దేశకుడవడం…

కవి చేసిన చైతన్య సంతకం

సమాజ హితం కోరే సాహిత్యం అవసరమని భావించే యువ కవి కార్తీక రాజు. ఎవరి గుండెల్లో కొంచెం గుబులైనా అతని మదిలో ‘అలికిడి’ మొదలైతదేమో! సమాజంలోని సమస్యలను స్పృశిస్తూ అతడు రాసే కవితలు ఎలుగెత్తి సూటిగా ప్రశ్నిస్తుం టాయి. ఎదుటివారి కష్టం చూసి మనసు ముక్కలు జేసుకుంటేనే అలాంటి వాక్యాలు రూపుదాలుస్తుంటాయి.     కార్తీక…

పునరపి జననం! పునరపి మరణం!

ఏది చివర? ఏది మొదలు? చేరింది కాదు… మొదలైంది కాదు! తొలి శ్వాస ఎక్కడో? తుది పలుకు ఎన్నడో! కాలానికే తెలీని ప్రహేళిక మేధస్సుకే చిక్కని ప్రశ్నావళి! అయిపోయిన చోటే ఆరంభం ఆరంభపు అడుగుతోనే అంతం! తుది చివరలు అంతుపట్టని బహుతలల వలయం! దిక్కు ఎల్లలు కలసిపోయిన అఖండ బ్రహ్మాండం! తానే అయినా తనకోసమే పితుకులాట!…

సారసాల వలసలు

కలకల రావాలు కాలం శకుంతాల శుభసూచికల జండా ఊపింది ఋతువును కనువిందు చేస్తున్న ప్రకృతి పక్షులు… ఒక వైపు మంచు వర్షం సమశీతోష్ణ స్థితి ప్రాంతాల్లో మంచు వెన్నెల సోన మంచినీటి సరస్సుల్లో ఆహారం నీరు గూడు వసతి కై వేల మైళ్లు ప్రయాణించే వలస సారసాలు… ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రకరకాల విదేశి గువ్వలు…

మనిషి వెలుతురు

తొలిసారిగా ఖాలీ చేతులు డబ్బుతో మాట్లాడినప్పుడు రూపాయి బలం తెలిసింది. పని పరిచమయ్యక చెమట చుక్కలకు రెట్టింపు లెక్కతో జేబు నిండినప్పుడు ఏడిపించిన కోరిక కాళ్ళ మీద పడి సలాం చేసింది. ఊరి వీధులన్నీ గౌరవిస్తూ వెంట నడిచాయి ఇంటికెళ్లాక మంచం మంచి నిద్రని వడ్డిస్తే కష్టం ఒడిలో ఆదమరచిన ఈ మనిషి వెలుతురులో ఇల్లు…

వలస పక్షులకు వరుస దాడులు

టప టపా ఆకులన్నీ రాల్తుంటే గుండె మెలిపెట్టడమే కదా రూపురేఖలు రంగుభేదాలు చిక్కుల్ని తెస్తాయా  కన్నీటి చుక్కల్ని రప్పిస్తాయా అసాంఘిక వటవృక్షం కొమ్మవిరిగి కొండెక్కిన మరో దీపం ఘాతుక పరంపర కొనసాగిస్తూ ఒక శార్దులం వంచన నిచ్చెనెక్కి కలల్ని కడతేర్చిన చరిత్ర పునరావృతం ఇది క్రూర పరిహాసం ఆగని ఘోర పరిహారం మలిగిన పసిడి వెలుగు…