మతాల పరంగా చట్టాలు
మనుషుల పరంగా దూరాలు
కలల్నీ నిద్ర పోనీకు
స్వప్నలిపికి రెక్కలు తొడుగు
పూలతోట ఉన్న చోటే ఉంటుంది
పూలు ఉన్నచోటుకే వస్తాయి
కడలి చెంత మనసు ఆనంద డోల
కడలి చెంత విషాద అలల గోల
వలపుల వర్షం పుడమి ప్రవహిస్తుంది
తుపాను వర్షం పుడమిని నీటి కుండ చేస్తుంది
రైతులోకం వసుధ నాక లోకం
రైతులేని లోకం భువి యమలోకం
ఉషాజాతరలో పక్షుల కిలకిలలు
నిశి సమయాన వాగె తూగెలయలు
రేడియమ్
9291527757