Category సాహిత్యం-శోభ

హాయి హాయి

ఊబి లో దున్న గెలిచిన రాజన్న ప్రగతి సున్న పక్కలో బల్లెం నీటికి నాచు చేటు వర్గ సమాజం దవా ఖానాలు పేదలకు నరకం పైసకు స్వర్గం  – రేడియమ్‌        9291527757 

పుస్తకం సమస్త దర్శనం

పుస్తకం ఓ నేస్తం పుస్తకం ఓ అక్షర క్షేత్రం పుస్తకం తెరిచినంత మాత్రం పదాల పసందైన పంట పెదవులు చప్పరించే తీపి వంట ! పుస్తకంలోని అక్షరాలు పాత్రలై ప్రాణం పోసుకుని సజీవములై నీతో మాట్లాడుతాయి అట్లా మాట్లాడుకుంటూ పోతే అబ్బో! అది మరో ప్రపంచమే! పుస్తకం విశ్వరూప దర్శనమే పఠించే వారంతా పార్థులే! పుస్తకం…

సినారే

తల్లిదండ్రులు విలువలు నేర్పిరి గురువులు జ్ఞానం నేర్పిరి కాలం క్రమశిక్షణ నేర్పింది ఊరు పాట నేర్పింది నగరం మాట నేర్పింది సమాజం సాహిత్యం నేర్పింది విలువలతో కూడిన సాహిత్యానికి పద్మభూషణ్‌ ‌వరించింది నీవు ఒక మేరు పర్వతం మంది మార్బలం శిష్యగణం లక్షలాది ప్రజల బలం నీ పాటలు అజరామరం నీ మాటలు నిత్య దరహాసం…

పదును పెట్టే పండ్రాయి పుస్తకం

కొడవలి గొడ్డలి కత్తి ఆరే రంపే పదునారిపోయిన ఆయుధాలకు పదును పెట్టే పండ్రాయి పుస్తకం ముక్క పోయిన మొద్దుగైన ఆయుధాలను కొత్తగా చేసే కొలిమి పుస్తకం వంకరి కట్టెను చక్కగా చెక్కే పెద్ద బాడిసే పుస్తకం నింగిలో మేఘం నేలన చినుకు పుడమి తల్లి పులకింత పుస్తకం ఆరని సూర్య కిరణాలు అక్షరాల ఒకట్య రెండా…

మనిషి పోరాటం

అమ్మా…. ఆధునిక రాజ్యాలంటే ఏమిటీ? నీకు తెలియకుండానే నీ సత్తువనంతా పీల్చీ నిన్ను నిర్జీవంగామార్చే పెట్టుబడి జలగలను పెంచి పోషించేవి ప్రజాస్వామ్యమంటే….? వోటేసేంత వరకు మాత్రమే స్వేచ్ఛనిచ్చీ ఎన్నికైనాక చట్టాలపేర నియంత్రించడం యుద్ధ్దమంటే….? పాలు కుడుస్తుండగానే…. స్తనాలను,శిశువుల పెదాలను తెగనరకడం మానవత్వమంటే…? ‘‘వీఆర్‌’’ ‌లో వీక్షిస్తూ అనుభూతి చెందటం మరీ కవిత్వమంటే…? మనిషింపోరాటం -దిలీప్‌.‌వి మానవ…

అభ్యుదయపు ఆకాంక్ష…

జీవితమంటే ఏమిటో నిశితంగా తెలుసుకొని అనేకానేక పరిణామాల్ని పరిశీలించిన కవిత్వానికే శాశ్వతత్వం ఉంటుంది. ప్రకృతిలోని అనేక కోణాలను జీవన సత్యాలుగా ఎందరో కవులు వివరించారు. ఓటమి మిగిల్చే విషాదానుభూతి వల్ల ఏర్పడే దుఃఖానుభవం మనిషిలో ఎన్నెన్నో పరిణామాలకు కారణమవుతుంది. అడుసు (బురద) తొక్కిన పాదాలు విషాదానుభూతుల్ని జాగ్రత్తగా దాటుతూ నడక నేర్చుకుని ఉత్తేజపు ఉద్దీపకాలై లక్ష్యం…

దేశపు మోహనం – మన్మోహనం

పుట్టింది పాత పంజాబ్‌లోని సిక్కుల కుటుంబం గడిపింది సాధారణ మధ్యతరగతి జీవనం తన విద్వత్తుతో విశ్వానికి సమాధానం మనసంతా జ్ఞానం నిండిన మాటల మౌనం దేశానికి స్వేచ్చనిచ్చిన ఆర్థిక పరిజ్ఞానం ప్రపంచీకరణకు బాటలు వేసిన ధీరత్వం ప్రధానిగా ప్రారంభించిన వంద రోజుల పని విధానం కేంబ్రిడ్జ్‌ నుండి కుగ్రామం వరకు తన ముద్ర వేసిన మహనీయుడుజి…

రా!

నోటికి తాళం వేసుకో నిత్యసత్యాలను కంధరం లో దాచుకో ఆకలి వేస్తున్న దాహం వేస్తున్న కడుపులో పైత్యరసం మంటలు రేపు తున్న నోరు మెదపకు ఆకలి తో కడుపు మాడ్చుకో చూడలేనివి భరించలేనివి కర్కశ రూపాలు కదను తొక్కుతున్న కంతలు కట్టిన గుర్రం లా ఉండిపో బలమైన బాహుల్ని ముడ్చుకుని జీ హుజూర్ అంటు కూర్చో…

ఈ పరి…

పిలవాలి ఏ లోతుల్లోంచో ఇంకా అరవాలి తలం దాటో అలసటతో తోపులాటలో వదిలేయాలి ముఖాలను కిందపడి రాలిపోయి బజారులో వాన నీటిలో తేలుతూ పోతుంటాయి పొలిమేరల వైపు పొలాలకు మొహాలు కోల్పోయి ప్రశ్నార్థక చిహ్నాలమై దేహాలతో ఆకారాలతో మాటలను బట్టి పోలుస్తూ అరచేతిని ఆడిస్తూ నుదుటిపై చెరిగిపోయిన రాకను వెతుక్కుంటాం! కొత్తవదనాలు కొలిమిలో తయారు చేయబడుతుంటాయి…