పేరు నిలుపుకో…
చైత్ర మాసపు ఉషస్సులా, ఆనంద భాగ్యాలనిచ్చు వసంతవాహినిలా, ప్రజల మదిన రమ్యభావమలర ఆత్మీయతానురాగాల్ని ఆకాంక్షల భావాల్ని పెనవేసుకుంటూ తెలుగునేల వైభవం వెలిగేలా సంస్కృతీ సంప్రదాయాలు సందడి చేస్తుంటే, విచ్చేస్తున్నజి తెలుగువారి షడ్రుచుల సంతోషాల సారధీ ఓ శుభకృత్! ఊహలకు సరికొత్త ఊపిరినిస్తావని నీ కోసం తెలుగు లోగిళ్లు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాయి. బతుకుల్లో బాకులు దూసిన గతవత్సరపు…
