Category ఎడిటోరియల్

5 ట్రిలియన్ ఎకానమీ కి పెద్ద సవాల్ ..!

A big challenge for the 5 trillion economy..!

గత వారం అమెరికా అధ్యక్షుడు పలు దేశాల ఎగుమతుల పై విధించిన సుంకాల పై ప్రభావం చూపిన దేశాలలో నే కాక అమెరికా లో కూడా వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి .  అమెరికా పలు నగరాల్లో  ట్రంప్ ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. భారత మీడియా కొంచం అతిగా చూపెడుతుందంటూ అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అంటుండగా  లోక్…

బీజేపీ అస్తిత్వ వికాసం..

The existential development of BJP..

శతాబ్దాల కాలంగా సర్వమతాల ప్రజల  సమిష్టి జీవనం కొనసాగుతున్న ఉపఖండం భారతావని ని హిందూ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలతో రూపుదిద్దుకున్న  రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ అను బంధ సంస్థ అయిన భారతీయ జనతా పార్టీ( బీజేపీ ) ఆవిర్భవించి 44 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా ఆ పార్టీ ప్రముఖులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు…

తెలంగాణా అంటే—ప్రజల భూములు, వారి సంస్కృతి, వారసత్వం

కంచా గచ్చిబౌలి లో భూ వివాదం పై సుప్రీం కోర్టు గట్టి ఆదేశాలు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి, సంబంధిత పక్షాలతో చర్చించి పరిష్కారం కనుగొనేందుకు కమిటీ ఏర్పాటు చేయాల్సి వొచ్చింది. విద్యార్థులు, పౌర సమాజం, ప్రతిపక్షాల   నిరసనలను పట్టించుకోకుండా ముందుకెళ్లిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది  గట్టి ఎదురు దెబ్బ ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం…

పర్యావరణం, వన్య ప్రాణుల పరిరక్షణలో ప్రభుత్వాల బాధ్యత

కంచ గచ్చిబౌలీ 400 ఎకరాల భూ వివాదం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ,రాష్ట్ర ప్రభుత్వంల మధ్య పతాక స్థాయికి చేరుకుంది. భూ యాజమాన్య హక్కుల వివాదంతో పాటు పర్యావరణం, వన్యప్రాణుల పరిరక్షణ అంశాలు కూడా తెర పైకొచ్చినాయి. 400 ఎకరాల కంచ గచ్చి బౌలీ లో ఎటువంటి వన్య ప్రాణులు లేవని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

పంచాంగ శ్రవణంలోనూ రాజకీయం

తెలుగు నూతన సంవత్సర ఆరంభం రోజు కూడా రాజకీయ పార్టీలు తమ వైషమ్యాలను వీడలేదు. తెలుగువారు అత్యంత శ్రద్ధతో ఆచరించే ఈ పండుగ రోజున రాష్ట్రంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా తమ ఇష్టదేవతలను వేడుకొంటూ ఎంతో సంబరంగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. ముఖ్యంగా మనది వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలోని డెబ్బై శాతం జనం వ్యవసాయ…

ముఖ్యమంత్రి విద్యా శాఖ కు ఎంత సమయం కేటాయించ గలరు..?

Revanth

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం తో ముగిసాయి.మార్చి 11న ప్రారంభం అయిన శాసన సభ, శాసన మండలి ఉభయ సభల సమావేశాలు 11 రోజుల పాటు కొనసాగాయి . కొన్ని సందర్భాలలో ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసినా సభ 12 బిల్లులు ..3 తీర్మానాలకు ఆమోదం తెలిపింది. బిఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి…

న్యాయ వ్యవస్థ నైతిక పతనావస్థకు చేరుకుందా?

Delhi High Court Judge Justice Yashwant Verma

మార్చి 14 రాత్రి దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌యశ్వంత్‌ ‌వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు దొరికిందనే వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫలితంగా, తనపై వొచ్చిన అవినీతి ఆరోపణల పట్ల, తన నైతిక పతనావస్థ పట్లా న్యాయవ్యవస్థ ఎలా స్పందిస్తుందన్న ప్రశ్న ప్రధానాకర్షణ అయింది. జస్టిస్‌ ‌యశ్వంత్‌ ‌వర్మకు…

దక్షిణాది రాష్ట్రాలు ఐక్యమయ్యేనా !

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చూపుతున్న నిరాదరణ , నిర్లక్ష్య వైఖరిని ఎదుర్కునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఐక్యం కావలసిన అవసరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రాలకున్న అధికారాలను ఒక్కొక్కటిగా తమ నియంత్రణలోకి తెచ్చుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్న కేంద్ర విధానాన్ని వ్యతిరేకించేందుకు ముఖ్యంగా దక్షిణాదిలోని బిజెపియేతర రాష్ట్రాలు సమిష్టి పోరాటం చేయాల్సి ఉందని, అందుకు…

డ్రీమ్‌ బడ్జెట్‌లో తెలంగాణకు గాడిదగుడ్డు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. గత దశాబ్ద కాలంగా తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందనడానికి శనివారంనాటి బడ్జెట్‌ అద్దంపడుతున్నది. రాష్ట్రంలోని భారతీయ జనతాపార్టీ నాయకులు తప్ప అన్ని రాజకీయ పార్టీలవారు బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదికేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితంచేసిన బడ్జెట్‌గా ఉందన్న విమర్శలు…