శతాబ్దాల కాలంగా సర్వమతాల ప్రజల సమిష్టి జీవనం కొనసాగుతున్న ఉపఖండం భారతావని ని హిందూ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలతో రూపుదిద్దుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అను బంధ సంస్థ అయిన భారతీయ జనతా పార్టీ( బీజేపీ ) ఆవిర్భవించి 44 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా ఆ పార్టీ ప్రముఖులకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ‘ప్రజాతంత్ర’శుభాకాంక్షలు. భారత రాజకీయ క్షేత్రంలో బీజేపీ ఒక ప్రధాన శక్తిగా ఎద గడం అత్యధిక హిందూ ప్రజల ఆశలను, అంచ నాలను ప్రతిబింబించిందనడంలో సందేహం లేదు. అయితే, ఈ పార్టీ 1980లో జనసంఘ్ మూలాల నుంచి ఉద్భవించినప్పటి నుండి ఇప్పటివరకు చేపట్టిన విధానాలు, రాజకీయ వ్యవహారాలపై విమర్శలు కూడా కొంత విస్తృతంగా ఉన్నాయని మర్చిపోలేం.
నిజానికి బీజేపీ కి స్వతంత్ర వ్యక్తిత్వం లేదు. అది సంఘ్ పరివార్ కు బాహ్యరాజకీయ వేదిక అన్నది బహిరంగ రహస్యమే. బిజెపి ఆవిర్భావం నాటి నుంచి హిం దుత్వ భావజాలం దాని అస్థిత్వంగా నిలిచింది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థల ప్రభావం పార్టీపై తీవ్రంగా కనిపిస్తుంది. ఇది మొదటి నుండి స్వతంత్ర భారత విభిన్నత్వాన్ని, బహుళత్వాన్ని స్వీకరి ంచడంలో రాజీ పడడం లేదన్న విమర్శలు ఉన్నాయి . ప్రపంచ అత్యంత ప్రజాస్వామ్య దేశంలో ఒకే మతం ఆధారంగా రాజకీయాలను నడపడం అనేకమందిని ఆందోళన గురిచేస్తుంది. 1990లలో రామ మందిర ఉద్యమం బీజేపీకి రాజకీయంగా మైలురాయిగా నిలిచింది. అయితే, అదే ఉద్యమం దేశంలో మతతత్వ విద్వేషాలకు దారితీసింది.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత దేశ రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించ బడింది. ఈ సంఘటన తరువాత దేశంలో జరిగిన మత ఘర్షణలు బీజేపీపై తీవ్ర విమర్శలకు కారణ మయ్యాయి. 1998-2004 మధ్య అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొన్ని అభివృద్ధి చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రజా ఆరోగ్య, విద్య, వ్యవసాయ రంగాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహ రించిందని విమర్శలున్నాయి. 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ ‘‘అచ్ఛే దిన్’’ అనే నినాదంతో మళ్లీ అధికారంలోకి వొచ్చిన తరువాత, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు విధానం అనేక చిన్న, మధ్య తరహా వ్యాపారాలను నష్టాల్లోకి నెట్టేశాయి. గత దశాబ్దంలో బీజేపీ పాలనలో రాష్ట్రపతి పదవి, గవర్నర్ వ్యవస్థ, సీబీఐ, ఈడీ వంటి స్వతంత్ర సంస్థల వ్యవహార శైలిలో మార్పులు కనిపిస్తున్నాయి.
ప్రతిపక్ష నేతలపై కేసులు, మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు, వాయిదా వేయబడే పార్లమెంటరీ చర్చలు – ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలుగా భావించాలి. ఉమ్మడి పౌరసత్వ చట్ట సవరణ, ఎన్ ఆర్‌సి వంటి విధానాల వల్ల మైనారిటీల హక్కులపై అనుమానాలు కలుగు తున్నాయి. మతపరమైన దాడులు, లవ్ జిహాద్, గో రక్షణ పేరిట హింస ఇవన్నీ దేశంలోని సామాజిక ఐక్యతపై మచ్చ వేస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నెలల తరబడి ఉద్యమాలు చేశారు. చివరికి, తీవ్ర ఒత్తిడికి లోనై చట్టాలను ఉపసంహరించాల్సి వొచ్చింది. రైతుల ఆత్మహత్యలు: రైతుల ఆర్థిక స్థితి మెరగడం కన్నా మరింత దిగజారిందనే నివేదికలు తెలియ జేస్తు న్నాయి.
ఉత్తర భారత పార్టీగా ముద్రపడ్డ బీజేపీ దక్షిణ భారతంలో విస్తరించడానికి తీవ్ర ప్రయత్నం ..ప్రణాళికలు రచిస్తున్నది. కర్ణాటక రాష్ట్రంలో మాత్రం రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన బీజేపీ తెలంగాణాలో లోక్‌సభ ఎన్నికల్లో 25 శాతం వోట్లను పొందగలిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం లో భాగస్వామిగా ఉంది. కేరళ, తమిళనాడులో ఉనికి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పార్టీ ఆవి ర్భావం మొదలు గత 44 సంవత్సరాలుగా దక్షిణ భారతంలో బీజేపీ పరిస్థితి..! ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన..తెలంగాణా ఏర్పాటు అంశంలో బిజెపి అగ్రనాయకత్వం ప్రారంభం నుండి ద్వంద వైఖరి అవలంభించింది. 1997 కాకినాడ తీర్మానం ‘ఒక వోటు రెండు రాష్ట్రాలు’ అన్న నినాదం ఇచ్చి 1998 మధ్యంతర ఎన్నికల పార్టీ ప్రణాళికలో ఆ వాగ్ధానాన్ని విస్మరించింది. 1999 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలుగు దేశంతో కలిసి పోటీ చేసి తెలంగాణా అంశాన్ని తెరమరుగు చేసింది.
ఆ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ పర్యటనలో ఆ పార్టీ అగ్రనాయకుడు ఎల్ కె అద్వానీ రాష్ట్ర రాజధాని తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి ప్రత్యేక రాష్ట్రం అవసరమే లేదని స్పష్టం చేసారు. మలి దశ ఉద్యమం సందర్బంగా రాజకీయ అనివార్యత తో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపిన బీజేపీ ..తదనంతరంఆ పార్టీ అగ్ర నాయకులు నరేంద్ర మోదీ..అమిత్ షాలు పలు సందర్భాల్లో ..వేదికల పైన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పు పడుతూ..తెలంగాణా విద్యార్థి యువతి యువకుల బలిదానాలను అవమాన పరిచే విధంగా ‘తల్లి ని చంపి బిడ్డకు జన్మనిచ్చారు..’ అని వ్యాఖ్యానించడం తెలం గాణ సమాజాన్ని అవమానించడమే ..!