Category ముఖ్యాంశాలు

పథకాల ఫలితాలు గుడిసె వరకు చేరాలి

– ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులు – 8 జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి పొంగులేటి సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం దార్శనికతతో తీసుకొచ్చిన భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసి వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని…

ఖర్గే సభను విజయవంతం చేయండి

పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 4న ఏర్పాటు చేస్తున్న అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని గ్రామ శాఖ అధ్యక్షుడు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. ఖర్గే…

చేనేతల రుణ మాఫీకి పరిపాలన అనుమతులు

5691మందికి లబ్ధి : మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసేందుకు రూ.33 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ అయ్యాయని వ్యవసాయ శాఖ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో 5,691మంది చేనేత…

విపత్తు నిర్వహణ సంస్ధ పునర్వ్యవస్ధీకరణ

నదీపరివాహక ప్రాంత నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంతవరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలా తెలంగాణ డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ అథారిటీ (తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ)ని బలోపేతం చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌,…

యువత రాజకీయాల్లోకి రావాలి

మాక్‌ పార్లమెంట్‌ సెషన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, నైతిక విలువలతో కూడిన, నీతిమంతమైన రాజకీయాలను ప్రవేశపెట్టాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని, అందుకే దేశవ్యాప్తంగా లక్షమంది యువతను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజాస్వామ్య…

విజన్‌-2047లో ఒక చాప్టర్‌గా హెల్త్‌ టూరిజం

ఏఐజీ హాస్పిటల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: తమ ప్రభుత్వం రూపొందిస్తున్న తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌లో హెల్త్‌ టూరిజం ఒక చాప్టర్‌గా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ను హెల్త్‌ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగానే డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడిని క్యాన్సర్‌ కేర్‌ సలహాదారుడిగా…

మేడారం జాతర తేదీల ప్రకటన

2026 జనవరి 28 నుంచి 31వరకు పూజారుల సంఘం ప్రకటన పట్ల మంత్రి సీతక్క హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ…

పాశమైలారం ఘటన దురదృష్టకరం

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి సహాయక చర్యలు పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి పర్యటన సంగారెడ్డి,ప్రజాతంత్ర,జులై 1: పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన అని కేంద్ర మంత్రి జి. కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 48 మంది మృతదేహాలు సంఘటన స్థలంలో లభ్యమయ్యాయని…

పాశమైలారంలో 13 మృతదేహాల గుర్తింపు

డిఎన్‌ఎ అనంతరం శవాల అప్పగింత మృతుల కుటుంబాలకు తక్షణం లక్ష రూపాయలు అందచేత పటాన్‌చెరు,ప్రజాతంత్ర,జులై 1: పాశమైలారం ఘటనలో మృతిచెందిన కార్మికుల కుటుంబీకులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతిచెందగా.. 13 మందిని గుర్తించారు. వారి మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా…