Category శీర్షికలు

నిప్పుల వాన

ఒక్కొక్కరు అమరత్వం ముద్దాడి మళ్లీ చిరునవ్వులవుతున్నారు.   చూడు ఉషోదయ రెక్కల మీద చరిత రాసుకుంటున్న మానవజాతి పరిమళ కథలు.   వారు ఎప్పటికీ ఆకాశ నిండైన తారలు   కవిత్వానికి దొరకని భాషా నిఘంటువులు   తిరిగి తిరిగి చిగురిస్తున్న నిప్పుల వాన మొలకలు. -జనజ్వాల

హన్న!

మెరుపు తీగెలు బుజ్జిగాడు నిద్రలేచాడు. లేచాడు అంటే లేవలేదు. బెడ్‌‌మీద పడుకొనే వున్నాడు. కళ్ళు తెరిచి వున్నాయి. ఎదురుగా అమ్మ ముఖం, నవ్వుతూ. బుజ్జిగాడు నవ్వలేదు. ఆవలింత తియ్యలేదు. బద్దకంగా అటూయిటూ దొర్లలేదు. విప్పారిన కళ్ళతో చూశాడు. చూస్తూనేవున్నాడు. ‘ఏమిటమ్మా తల్లీ’ అని గోముగా నుదురుకు నుదురు ఆనించి ముక్కుకు ముక్కు రాస్తూ ముద్దు చేసింది…

వికృతి!

మెరుపు తీగెలు -బమ్మిడి జగదీశ్వరరావు ‘ఇదే కొండ!’ ‘ఏది?’ ‘ఇదే… గుట్టకాదు, మనం వున్నదే కొండ. ఉంది అంటే వుంది. లేదు అంటే లేదు’ ‘అదేంటి?’ ‘అంటే, కొండని పనసకాయ చెక్కినట్టు చెక్కేశారు. అంతే’ ‘నాకయితే మనకి చిన్నప్పుడు చేసిన డిప్ప కటింగు గుర్తుకొస్తోంది’ ‘రెండ్రోజులు ఆగితే ఆపక్కంతా నున్నగా గుండు గీకినట్టు గీకేస్తారు’ ‘అడవి……

ఇది వివేక్ మాయ!

-నిర్వాణ లంకమల దారుల్లో- ఎంత బాగుందో ఈ బుక్. మొదటి నుండి ప్రకృతి అంటే ఇష్టం వల్ల నేను ఈ పుస్తకానికి చాలా తొందరగా కనెక్ట్ అయ్యాను. ఇప్పటికి రెండుసార్లు చదివాను. మొదటిసారి చదివినప్పుడు కలిగిన అనుభూతి కంటే, రెండోసారి చదివినప్పుడు కలిగిన అనుభూతి వేరు, అదేందో తిరుపతిలో వెంకన్నను చూసినంతసేపు కళ్ళలో ఉంటాడు, కొండ…

నిర్భయ స్వరం – కాళోజి

చెమ్మ : వారాల ఆనంద్ ‘పతాక మారింది కానీ పద్ధతి మారలేదు’ ఇది స్వాతంత్ర భారతదేశ స్థితిమీద కాళోజీ మాట “అన్యాయాన్ని ఎదిరించనివాడు,  అన్యాయంలో భాగమే” ఇది సమస్త మానవాళి పట్ల కాళోజీ అవగాహన. “నిజం మాట్లాడితే నేటి ప్రపంచంలో నువ్వే నేరస్థుడవుతావు” ఇదీ వర్తమాన సమాజ స్థితి గురించి కాళోజీ చెప్పినమాట. ఆయన “నా గొడవ” అన్నప్పుడు అది ఆయన ఒక్కరి గొడవ…

త్రిపదలు

ఏ. నాగాంజనేయులు రేకుల షెడ్డు నీడలో అందరికీ ఉప్పునీటి స్నానాలే * చెట్టు చిన్నది నీడ ఎందరికో * కళ్ళజోడు పగిలింది అక్షరాలు దుఃఖించాయి * చీకట్లో మిణుగురులు కదిలే దీపాలు * చెట్టు ఒంటరి పిల్లకారు లేక పిల్లగాలి రాక * నది ఒడ్డున నావకు అలల జోలపాట * పూలకుండి మా ఇంటి…

లోకానికి తెలియని లోపలితనమే ఎక్కువ

చెమ్మ : వారాల ఆనంద్ కొన్నిజీవితాలు ఒక ఊరికథగా మొదలై దేశం చరిత్రగా ముగుస్తాయి. పి. వి.నరసింహారావు సాధారణ రాజకీయనాయకుడిగా మాత్రమేకాక ఆయనలో దాగిఉన్న రచయిత, అనువాదకుడు, భాషావేత్త ఇవన్నీ కలిసి విభిన్న సాహిత్యవ్యక్తిత్వాన్ని నిర్మించాయి. ఆయన రచనల్ని చదివితే  రాసిన దానికంటే రాయక స్ఫురింపజేసిన విషయాలే ఎక్కువేమో అనిపిస్తుంది. రాజకీయాల్లోకి రాకుండా సాహిత్య సృజనకే పూర్తికాలం వెచ్చించి వుంటే ప్రపంచ సాహితీలోకంలో వెలిగిపోయేవారు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన పివికి చిన్ననాడే సాహితీస్పర్శ…

అదే సముద్రం

రాళ్ళబండి శశిశ్రీ 1 పగలు పబ్బాన్ని గడుపుకొని రాత్రిళ్ళు దుఃఖాన్ని మిగిల్చే మనుషులు చుట్టూ ఉన్నా అలై పొంగుతూనే ఉంటుంది సముద్రం! 2 అలంకరించుకున్న అబద్దాలతో లోకం అందంగా వెలిగిపోతూంటుంది నగ్నత్వాన్ని చూడలేక మనుషులు అంధత్వాన్ని ప్రేమిస్తూంటారు 3 చీకట్లో దాక్కున్న రాత్రుళ్ళు కాదు వెలుగు పగటి వేషం మోసం ద్వేష హృదయానిదో కమ్మని భాష!…

ఫిలాసఫికల్ థియరీ కేరాఫ్ పచ్చబొట్టు

ఆయన అక్షరం ఆయువు పోసుకొని, పదమై బంధాలను కలుపుకున్నట్లు, యాస నూరిన కత్తి అంచలంచెలు దాటి, కాలం నుదుటిపై రక్తపుబొట్ల సువాసనను అద్ది, కవిత్వ శబ్దమై మనిషి తత్వాన్ని ఒంటపట్టించుకొని తర్కం నుండి వర్తమాన మెట్లపై పచ్చబొట్టును పొడిచి తన కలం దాహం తీరని భవిష్యత్తుకు మేల్కొలుపు రాగమంటూ, పెదవి ప్రమిదల నుండి పుట్టిన వెలుగు…