– ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు సుకుంది. కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో అర్ధరాత్రి చోటు చేసుకుంది. దుబ్బాక మండలంలోని బలవంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2)తో కలిసి సిద్దిపేట నుంచి తమ స్వగ్రామానికి కారులో వస్తుండగా బుధవారం అర్ధరాత్రి సమయంలో అదుపుతప్పి బావిలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జేసీబీ సహాయంతో బావిలో నుంచి కారును, నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందడంతో బలవంతాపూర్, అప్పనపల్లి గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





