బీసీ సమాజాన్ని మోసం చేసిన బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు

హైదరాబాద్, ఆగస్టు 17: బీసీ సమాజానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హామీలు ఇచ్చి మోసం చేశాయని అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు. ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పించడం వల్ల నిజమైన బీసీ వర్గాల వాటా తగ్గిపోయిందని, ఇప్పుడు పలు బీసీ రిజర్వ్ డ్‌ స్థానాల్లో మజ్లిస్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం ఆందోళనకరమని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా లేరని, యూపీఏ హయాంలో సెక్రటరీ స్థాయిలో ఒక్క ఓబీసీ అధికారి కూడా నియమితులు కాలేదని ఎత్తిచూపారు. ఎంబీసీ కార్పొరేషన్ పనితీరుపై ప్రభుత్వం నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతోందని, కేంద్ర సంక్షేమ పథకాలను బీసీ సమాజంలో ప్రతి వర్గానికి వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

చేరికల కార్యక్రమం సంద‌ర్భంగా అల్వాల్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి స్థానిక కార్యకర్తలు, బీసీ నాయకులు బీజేపీలో చేరారు. వందే మాతరం గేయం పట్ల కాంగ్రెస్ నేతల వ్యవహారశైలిపై రామచందర్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ గేయం పట్ల గౌరవం లేకపోవడం దేశ వ్యతిరేక ధోరణికి నిదర్శనమని, ఇలాంటి భావజాలాన్ని యువత గుర్తించాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *