ఊరూవాడా కాంతులు నింపాలి

– ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ని లబ్దిదారులు జరుపుకోవాలి
– హైదరాబాద్ ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ స్థలాల్లోనూ ఉత్సవాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : సొంత ఇంటి కలను నిజం చేస్తూ అనేక జీవితాల్లో కొత్త కాంతులను తెస్తున్న ఇందిరమ్మ ఇండ్లు వద్ద దీపావళి పండుగ సంబురాలను పెద్ద ఎత్తున జరపనున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పేరుతో చేపట్టిన ఈ ఉత్సవాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులందరినీ భాగస్వామ్యులను చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పూర్తి అయిన రెండు లక్షల ఇందిరమ్మ ఇండ్ల వద్ద దీపాలు వెలిగిస్తూ పండుగను మరింత శోభాయమానం చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతం తెలిపారు. వినూత్నమైన ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులందరూ పాల్గొనాలని కోరారు. తమకు సొంత ఇల్లు ఏర్పడిందన్న సంతోషంతో జరుపుకుంటున్న ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొననున్నారని వివరించారు. మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి ముందు, దీపాలను వెలిగించి ఆ కుటుంబాల సమక్షంలోనే పండుగను జరుపుకుంటామన్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో ఇప్పటికే పూర్తి అయిన ఇండ్ల ముంగిట్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేత్రస్థాయి సిబ్బందికి, గ్రామ కార్యదర్శులకు సూచనలిచ్చామన్నారు. లబ్దిదారులందరూ తమ ఇండ్లు కనిపించేలా కుటుంబంతో జరుపుకుంటున్న పండుగ ఫొటోలను ఇందిరమ్మ ఇండ్లు మొబైల్ యాప్ ద్వారా తీసి వాటిని తమ సోషల్ మీడియా(పేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం) వంటి వాటిలో అప్‌లోడ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ క్యూర్ పరిథిలో కూడా..

ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు హైదారాబాద్ మహానగర పరిథిలోని అత్యంత ఖరీదైన భూమూల్లో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో చేపట్టిన ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా పలుచోట్ల నిర్మాణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టు సైట్‌లలో కూడా దీపావళి సంబురాలను నిర్వహించనున్నామని గౌతం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సైట్‌ల వద్ద దీపావళి పండుగ జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొద్ది కాలంలోనే తమ ఇరుగుపొరుగు కానున్న కుటుంబాలతో కలిసి నివసించబోయే సొంత ఇంటి ప్రాంగణంలో పండుగ సంబురాలను నిర్వహిస్తున్నామన్నారు. పండుగ నాడు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లబ్దిదారులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *