30న జాబ్ మేలా

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల 30న ఉదయం 11 గంటలకు జాబ్ మేలా జరుగుతుంది. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో జరుగు ఈ జాబ్ మేలాలో మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ/డిప్లొమా చేసిన 18 నుండి 35 సంవత్సరాల వయసు వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలియజేసిందిలి. రూ.20,000 వరకు వేతనం ఉండే ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలకు రవీందర్ కుమార్, రీజినల్ మేనేజర్ (ఫోన్ 6261688998)ను సంప్రదించాలని కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో(UEI&GB/MCC) వద్ద నేరుగా హాజరు కావాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *