– ట్రెక్కింగ్ చేసిన ఎంపీ వంశీకృష్ణ
మంథని, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : చా
ఎంపీ ట్రెకింగ్ ఛాలెంజ్.. గెలిస్తే వన్‌ప్లస్ ఫోన్ గిఫ్ట్ 
రామగిరి ఖిల్లాలో సుమారు 10 కి.మీ మేర సాహసోపేతంగా ట్రెక్కింగ్ చేసిన ఎంపీ వంశీకృష్ణ యువతకు స్ఫూర్తినిస్తూ ఒక ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరారు.యువతలో సాహస క్రీడలు,ఫిట్‌నెస్ పట్ల ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సవాల్‌ను ముందుకు తీసుకు వచ్చారు. ఈ ట్రెక్కింగ్సవాల్‌లో విజేతగా నిలిచిన వారికి వన్‌ప్లస్ ఫోన్‌ను బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించడంతో యువతలో భారీ స్పందన వ్యక్తమవుతోంది.
చారిత్రక సంపదకు సరికొత్త వైభవం
రామగిరి ఖిల్లా తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది .ఇక్కడి పురాతన ఆలయాలు,కోట నిర్మాణాలు,ప్రకృతి అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఎంపీ వంశీకృష్ణ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం.రాములవారి దర్శనం నుంచి ఖిల్లా పైభాగంలోని శివాలయం,శ్రీరామచంద్ర ఆలయాల సందర్శన వరకు సాగిన ఎంపీ పర్యటన రామగిరి ప్రాంత అభివృద్ధిపై ఆయన చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనంగా నిలిచింది.రామగిరి ఖిల్లాకు ప్రపంచస్థాయి గుర్తింపు,మంథని ప్రాంతానికి పర్యాటక వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముందుకు సాగుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





