– సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న విక్రమార్క
తిరుమల, సెప్టెంబర్ 21 : తిరుమల తిరుపతి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆదివారం రాత్రి ఉత్సవాల్లో పాల్గొని సోమవారం తెల్లవారుజామునల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అధికారులు స్వామివారి శేష వస్త్రంతో ఆయనను ± సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





