వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14: ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవస్థానంలో బుధవారం అమ్మ వారు మహాలక్షి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అ మ్మవారిని ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంకాలం హంస వాహనంపై ఊరేగింపు జరిపినట్లు ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ఈఓ రామల సునీత తెలిపారు. తొగుట పీఠా ధీశ్వరులు మాధవానంద సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భద్రకాళీ సేవా సమితి కన్వీనర్ అయితా గోపీనాధ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం, రాత్రి అశేష అన్నదానం నిర్వహించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





