శిశువులకు మెరుగైన వైద్యం అందించాలి

– వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలి
– వైద్యులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశం

ఆదిలాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్‌(ఎస్‌ఎన్‌సీయూ)లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రిమ్స్ హాస్పిటల్‌ను మంగళవారం సందర్శించారు. ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించారు. ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న శిశువులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇతర హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న శిశువులు, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హాస్పిటల్‌లో ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ సమయంలో తీసుకున్న చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఇతర అధికారులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *