బతుమ్మకుంట ముమ్మాటికీ చెరువే

– పదెకరాల్లో ఉన్నట్లు నాసా చిత్రాలు ఉన్నాయి
– ఎడ్ల సుధాకర్ హైకోర్టుకు వెళ్లడంపై హైడ్రా కమిషనర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : బతుకమ్మ కుంటను హైడ్రా అభివృద్ధి చేయడంపై ఎడ్ల సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారని, అది ముమ్మాటికీ చెరువేనని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. 1986 నాటి అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఆయన వద్ద ఉందని, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంటేనే రూల్ ప్రకారం చెల్లుబాటు అవుతుందని అన్నారు. బతుకమ్మ కుంట చెరువు భూమి తనదే అని, అక్కడ తాను వ్యవసాయం కూడా చేసినట్లు ఎడ్ల సుధాకర్ హైకోర్టును ఆశ్రయించిన క్రమంలో అందుకు ఆధారాలు లేవని, అయినా చెరువును ఆక్రమించి వ్యవసాయం చేయడం కూడా నేరమేనని హైడ్రా కమిషనర్ అన్నారు. ఇది ఇటీవల చర్చనీsయాంశమైంది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా స్పందించారు. బతుకమ్మ కుంట అభివృద్ధిపై డివిజన్ బెంచ్‌కు సుధాకర్ వెళ్లారని, కంటెంప్ట్ ఆర్డర్‌లో కోర్టు తమను తప్పుపట్టిందని చెప్పారు. డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారం అక్కడ బోర్డులు, ఇతర నిర్మాణాలు తొలగించామని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలను తాము పాటిస్తామని స్పష్టం చేశారు. సుధాకర్ అసలు అక్కడ చెరువే లేదని అంటున్నారని, కానీ 1990 నాటి నాసా శాటిలైట్ ఫొటోల్లో బతుకమ్మ కుంట కనిపిస్తోందని చెప్పారు. 1970లో భారతీయ సర్వే ఆఫ్ ఇండియా నీటి సర్వేల్లోనూ పూర్వం నుంచే చెరువు ఉన్నట్లు తేలిందన్నారు. ఎర్రకుంట పేరుతో 1975 పహణీలలో 563/-1తో బతుకమ్మ కుంట పదెకరాల్లో ఉందన్నారు. సుధాకర్ భూమిని చెరువుగా మార్చామనేది నిజం కాదని, తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు నార్సింగ్‌లోని ముష్కిమ్ చెరువు ఆక్రమణ కూల్చివేతలపై ముందుగానే సమాచారం ఇచ్చామని హైడ్రా కమిషనర్ తెలిపారు. సున్నం చెరువు బాధితులతో సమావేశం ఏర్పాటు చేశామని, సీఎం ఆదేశాలతో వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఐలాపూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణలపైనా డ్రైవ్ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకూ హైడ్రా 2,093 ఎకరాల భూమిని రికవరీ చేసిందన్నారు. ఇప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం ఆ భూముల విలువ రూ.80 వేల కోట్ల వరకు ఉంటుందని రంగనాథ్ తెలిపారు. హైడ్రా పరిధిలో 90 ఎఫఐఆర్‌లు ఇప్పటివరకు నమోదయ్యాయని వెల్లడించారు. ఫాతిమా కాలేజీ విషయంలో హైకోర్టు ఆదేశాలతో ఎఫ్‌టీఎల్ డిమార్కింగ్ చేయాలని రంగనాథ్ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *