కూకట్‌పల్లిలో విషాద ఘటన

– నవ దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్(28), మంజుల(27) అనే నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక్ ఉరివేసుకోగా మంజుల పాయిజన్ తీసుకొన్నట్లు సమాచారం. మార్చి 8న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నవదంపతుల మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కార్తీక్ మార్కెటింగ్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మంజుల గృహిణి. మృతుడి సోదరుడు మాట్లాడుతూ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం తమను కలిచి వేసిందని, తాము షాక్‌లో ఉన్నామని తెలిపారు. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియదన్నారు. బెడ్ రూంలో కార్తీక్ ఉరివేసుకోగా మంజుల పాయిజన్ తీసుకుందని తెలిపాడు. ఇద్దరూ మంచిగా ఉండేవారన్నారు. నిన్న సాయంత్రం వారికి ఫోన్ చేయగా బాగానే మాట్లాడారని చెప్పారు. సీఐ శోభన్ మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రైవేట్ హాస్పిటల్ వారు తమకు ఫోన్ చేసి ఇద్దరు సూసైడ్ చేసుకున్న కేస్ వచ్చిందని తెలిపారు. దీంతో తమ టీమ్‌తో హాస్పిటల్‌కు చేరుకున్నామన్నారు. కార్తీక్ బెడ్ రూమ్ లో ఉరివేసుకోగా మంజుల పాయిజన్ తీసుకున్నట్లు ఉందని తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాదస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారు ఎందుకు సూసైడ్ చేసుకున్నారో కారణాలు తెలియరాలేదన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇంట్లో క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నామని, సూసైడ్ నోట్ లభించలేదని సీఐ శోభన్ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *