deccan.com

deccan.com

శుభ్రతను మెరుగుపరిచేందుకు కీలక చర్యలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04: ‌పారిశుధ్య నిర్వహణలో భాగంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొ రేషన్‌ ‌నగరంలో శుభ్రతను మెరుగు పరిచే దిశగా పలు కీలక చర్యలు చేపట్టి ందని మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఆమె పారిశుధ్య కార్మికులకు రిక్షాలు, వీల్‌ ‌బారోల్‌/‌పుష్‌ ‌కార్ట్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భ ంగా ఆమె మాట్లాడుతూ... నగర పరిశుభ్రతను మరింత మెరుగు పరిచేందుకు 1500 చెత్త రిక్షాలు (ట్రై సైకిళ్లు) కొనుగోలు చేసి ప్రతి సర్కిల్‌ ‌కు 50 చొప్పున అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా 1500 వీల్‌ ‌బారోల్‌/ ‌పుష్‌ ‌కార్ట్ ‌లు కొనుగోలు చేసి ప్రతి సర్కిల్‌ ‌కు 50 వీల్‌ ‌బారోల్‌/ ‌పుష్‌ ‌కార్ట్ ‌లను అందుబాటులో ఉంచామని తెలిపారు. గార్బేజ్‌ ‌వల్నరబుల్‌ ‌పాయింట్స్ ‌వద్ద చెత్తను పారవేయకుండా ఊడ్చిన చెత్త ను నిల్వ చేసి మున్సిపల్‌ ‌వాహనాలకు ఇవ్వడానికి ఇట్టి త్రిచక్ర చెత్త రిక్షాలు మరియు వీల్‌ ‌బారోల్‌ ‌లు పారిశుధ్య కార్మికుల గ్రూపులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వీధుల్లో ఊడ్చే ప్రదేశాల్లో చెత్త సేకరణకు ఈ రిక్షాలు ఉపయోగి ంచడం జరుగుతుందని, జి.వి.పిల తొలగింపులో ఈ రిక్షాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. అదే విధంగా పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగు పరుస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయ పడతాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌ ‌మెడికల్‌ ఆఫీసర్‌ ‌భార్గవ్‌ ‌నారాయణ, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

చెత్త సేకరణకు రిక్షాలు పంపిణీ చేసిన మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04:   ‌పారిశుధ్య నిర్వహణలో భాగంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొ రేషన్‌ ‌నగరంలో శుభ్రతను మెరుగు పరిచే దిశగా పలు కీలక చర్యలు చేపట్టి ందని మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ ‌సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్య…

రాష్ట్రంలో మరో రెండు కొత్త ఆర్టీసీ డిపోలు..

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 04: ఆర్టీసీ వ్యవస్థలో 10-15  సంవత్సరాల తర్వాత రెండు నూతన ఆర్టీసీ డిపో లు ఏర్పాటు చేస్తున్నా మని రవాణా, బిసీ సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌వెల్లడించారు. రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వాన రవాణా శాఖ మంత్రిగా తనకు  సంతృ ప్తిస్తోందని అన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల…

బొటానికల్‌ ‌గార్డెన్‌లో ప్రజాపాలన దినోత్సవాలు

ఎకో టూరిజం డెవలప్‌ ‌మెంట్‌ ఆఫీస్‌ ‌కు శంకుస్థాపన.. వృక్ష పరిచయ క్షేత్రం, వర్చువల్‌ ‌వైల్డ్ ‌లైఫ్‌ ‌సఫారీ, ఎఆర్‌ ‌విఆర్‌ ‌బిల్డింగ్‌ ‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 4 :‘‘‌ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు’’లో భాగంగా తెలంగాణ అటవీశాఖ  కోట్ల విజయ భాస్కర్‌ ‌రెడ్డి బొటానికల్‌ ‌గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి…

కౌలురైతుకు ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

జ్యూరీ సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్ 22 లక్షల కౌలు రైతులు ఉన్నారని రేవంత్ చెప్పారు ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్ మహిళా కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి మహిళా కిసాన్ అధికార మంచ్ జాతీయ నాయకురాలు డాక్ట‌ర్‌ రుక్మిణీ రావు ముషీరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4 : కౌలు రైతులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు…

ఉడకలేదని తెలుపుతున్న మెతుకు!

తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, పది సంవత్సరాల తెలంగాణ/భారత రాష్ట్ర సమితి పాలన తర్వాత, కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది నిండుతున్నది. ఏ ప్రభుత్వానికైనా ఏడాది పని తీరు ఒక గణనీయమైన సూచికే అవుతుంది. ఐదు మైళ్ల ప్రయాణంలో ఈ మైలు ఎలా గడిచిందో ఈ మైలురాయి దగ్గర ఆగి…

కాంగ్రెస్‌ ఏడాదిపాలనపై ప్రతిపక్షాల దాడి

 రేవంత్‌రెడ్డి పాలనపై బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌ఛార్జిషీటు    ( మండువ రవీందర్‌రావు ) కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ‘ప్రజాపాలన విజయోత్సవా’లను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుండగా, దాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు ‘ఛార్జిషీటు’పేరున తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలనిచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఈ ఏడాదికాలంలో వాటిని నిలుపుకోలేకపోయిందంటూ ఎదురుదాడి…

Earthquake in Telugu states తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

Earthquake

ములుగు జిల్లా ఏటూరునాగారం కేంద్రంగా ప్రకంపనాలు రిక్టర్ స్కేలు పై 5.3గా నమోదు భూ ఉపరితలానికి సుమారు 10కి.మీ లోతులో కదలిన భ్రంశాలు జోన్ 2 పరిధిలోను ప్రకంపనాలు కోల్ బెల్టులో ఆందోళన 55ఏళ్ల అనంతరం అత్యధికంగా నమోదు మరిపెడ, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, డిసెంబరు 4: భూకంపంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి. తెలుగు…

15 జిల్లాల్లో ఇంటింటి సర్వే పూర్తి

దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్…

శ్రీకాంత్‌చారి అమరత్వం ఎంతో గొప్పది: కేటీఆర్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 3 : ‌శ్రీకాంతాచారి అమరత్వం గొప్పదని, ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ప్రజలు ఎప్పటీకి మరువరని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం దమనకాండ, కేసీఆర్‌ అరెస్టును చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి అగ్నికి అహుతి అయ్యి అమరుడయ్యారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిందన్నారు. శ్రీకాంతాచారి…

తెలంగాణ పోరాటంలో శ్రీకాంత్‌చారి సేవలు ఎనలేనివి :బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 3 : ‌తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించిన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని చెప్పారు. కేసీఆర్‌ అరెస్టును, ఉద్యమకారులపై ప్రభుత్వ అణచివేతను సహించలేక ఆత్మబలిదానం చేసుకున్న…