చెత్త సేకరణకు రిక్షాలు పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 04: పారిశుధ్య నిర్వహణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్ నగరంలో శుభ్రతను మెరుగు పరిచే దిశగా పలు కీలక చర్యలు చేపట్టి ందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఆమె పారిశుధ్య కార్మికులకు రిక్షాలు, వీల్ బారోల్/పుష్ కార్ట్‌లను పంపిణీ చేశారు.ఈ సందర్భ ంగా ఆమె మాట్లాడుతూ… నగర పరిశుభ్రతను మరింత మెరుగు పరిచేందుకు 1500 చెత్త రిక్షాలు (ట్రై సైకిళ్లు) కొనుగోలు చేసి ప్రతి సర్కిల్ కు 50 చొప్పున అందించడం జరిగిందన్నారు.
అదేవిధంగా 1500 వీల్ బారోల్/ పుష్ కార్ట్ లు కొనుగోలు చేసి ప్రతి సర్కిల్ కు 50 వీల్ బారోల్/ పుష్ కార్ట్ లను అందుబాటులో ఉంచామని తెలిపారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ వద్ద చెత్తను పారవేయకుండా ఊడ్చిన చెత్త ను నిల్వ చేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వడానికి ఇట్టి త్రిచక్ర చెత్త రిక్షాలు మరియు వీల్ బారోల్ లు పారిశుధ్య కార్మికుల గ్రూపులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వీధుల్లో ఊడ్చే ప్రదేశాల్లో చెత్త సేకరణకు ఈ రిక్షాలు ఉపయోగి ంచడం జరుగుతుందని, జి.వి.పిల తొలగింపులో ఈ రిక్షాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. అదే విధంగా పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగు పరుస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయ పడతాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ భార్గవ్ నారాయణ, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.