ఎకో టూరిజం డెవలప్ మెంట్ ఆఫీస్ కు శంకుస్థాపన..
వృక్ష పరిచయ క్షేత్రం, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ,
ఎఆర్ విఆర్ బిల్డింగ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 4 :‘‘ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు’’లో భాగంగా తెలంగాణ అటవీశాఖ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల శుంకుస్థాపనలు, ప్రారం భోత్సాలు చేశారు. ఫారెస్ట్ అండ్ ఎకో టూరిజం డెవలప్ మెంట్ ఆఫీస్ కు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగూడెం – పాల్వంచ డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ లను వర్చువల్ గా ప్రారంభించారు.
వృక్ష పరిచయ క్షేత్రం, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ, ఎఆర్‌విఆర్ బిల్డింగ్ ను అలాగే తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన వాహనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.