జ్యూరీ సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్
22 లక్షల కౌలు రైతులు ఉన్నారని రేవంత్ చెప్పారు
ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్
మహిళా కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి
మహిళా కిసాన్ అధికార మంచ్ జాతీయ నాయకురాలు డాక్టర్ రుక్మిణీ రావు
ముషీరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4 : కౌలు రైతులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సరికాదని, వెంటనే సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చి కౌలు రైతులకు న్యాయం చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంలో సెప్టెంబర్ 2023లో కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖను ప్రస్తావిస్తూ, ఇక్కడ కౌలు రైతులు చెప్పిన సమస్యలను అప్పుడు రేవంత్ రెడ్డినే లేఖలో చెప్పారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన కౌలు రైతులు వందల సంఖ్యలో బుధవారం హైదరాబాద్ చేరుకొని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బారులో తమ గొంతు వినిపించారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన 14 మంది కౌలు రైతులు ఒర్సు కవిత (నల్లగొండ జిల్లా), కరెల్లి యాదమ్మ(వికారాబాద్ జిల్లా), దొమ్మటి లావణ్య(సిద్దిపేట జిల్లా), బింగి తిరుపతి, ముండల రాజేందర్(ఆదిలాబాద్ జిల్లా) తదితరులు వారి సమస్యలను జ్యూరీ ముందు తమ వివరించారు.
రాష్ట్రంలోని ముఖ్య రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాల నిర్వహణలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖుల జ్యూరీగా ప్రొఫెసర్ హరగోపాల్, సామాజిక కార్యకర్త డాక్టర్ వి.రుక్మిణీ రావు, మాజీ ఎడిటర్ కె.శ్రీనివాస్ పాల్గొని కౌలు రైతులకు మద్దతు తెలిపారు.
జ్యూరీ సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. కౌలు రైతుల సమస్యలు సీఎంకు బాగా తెలుసని, అయినా ప్రభుత్వం ఏడాదైనా కౌలు రైతుల గుర్తింపు చేసి వారికి పథకాలు అందించకపోతే, ముఖ్య మంత్రి లేఖలో బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి చెప్పిన విషయాలు ఆయనకు కూడా వర్తిస్తాయన్నారు. బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదని భావించవలసి వొస్తుందని అన్నారు. కౌలు రైతులు చెప్పిన సమస్యలను, వారి డిమాండ్లను తాము ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి వత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. జ్యూరీ సభ్యులు, మహిళా కిసాన్ అధికార మంచ్ జాతీయ నాయకులు డా.రుక్మిణీ రావు మాట్లాడుతూ, కౌలు రైతులను గుర్తించడానికి 2011 లో కాంగ్రెస్ తెచ్చిన ‘భూ అధీకృత సాగుదారుల చట్టం’ ఉందని, దాని ప్రకారం లబ్ధి పొందిన కౌలు రైతులు ఈరోజు పబ్లిక్ హియరింగ్ లో కూడా మాట్లాడారన్నారు. కాబట్టి కౌలు రైతులను గుర్తించడం కష్టమని కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి వీలు లేదన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా వారికి బ్యాంకు రుణాలు, పంట నష్టపరిహారం, పంట కొనుగోలు, రైతు భరోసా వంటి పథకాల లబ్ధి కూడా చేరుకునేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషమని, మహిళా కౌలు రైతులను కూడా గుర్తించి ప్రభుత్వం కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జ్యూరీ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ 22 లక్షల మంది ఉన్న కౌలు రైతులు రాష్ట్రంలో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డే చెప్పారని అన్నారు. రాహుల్ గాంధీ కూడా కౌలు రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఆరు గ్యారంటీలలో కూడా వారిని చేర్చారన్నారు.

అయినా ఇప్పటి వరకు కౌలు రైతులను గుర్తించకపోవడంతో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించవలసి వస్తున్నదని అన్నారు. కౌలు రైతులు ఈ డిమాండ్లను గట్టిగా ఉద్యమ రూపంలో తీసుకు వెళ్ళడం ద్వారా సాధించుకోవాలని, ఈ ప్రజా దర్బార్ విషయాలు పతాక శీర్షికలుగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా నేతలు బి.కొండల్, విస్సా కిరణ్ కుమార్(రైతు స్వరాజ్య వేదిక), పశ్య పద్మ(తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం), టి.సాగర్ (తెలంగాణ రైతు సంఘం), వి.ప్రభాకర్(ఏఐపికెఎస్), పెద్దారపు రమేష్(ఏఐకేఎఫ్), గౌని ఐలయ్య(ఏఐకేఎంఎస్), భూమన్న(ఏఐకేఎంఎస్), సూర్య నారాయణ(తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల సంఘం), వెంకటరాములు(తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం), కన్నెగంటి రవి(రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణ పీపుల్స్ జెఏసి), ఇంద్రసేన(తెలంగాణ రైతాంగ సమితి), సోమిడి శ్రీనివాస్(తెలంగాణ రైతు సంఘం), బి. భాస్కర్(ఏఐకేఎంఎస్), గోనె కుమార స్వామి(వ్యవసాయ కార్మిక సంఘం), మాదినేని రమేష్(తెలంగాణ కౌలు రైతు సంఘం) లు మాట్లాడుతూ వెంటనే 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తూ, కౌలు సాగుదారుల నుంచి దరఖాస్తులు తీసుకొని, వారికి ఎల్.ఈ.సి. గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.
గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకు పంట బీమా, పంట నష్ట పరిహారం, రైతు బీమా, పంట అమ్మకము, బ్యాంకు రుణాలు వంటివన్నీ అందించాలన్నారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సహాయం కాబట్టి, కౌలు రైతులు స్వంత పెట్టుబడితో వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి, రైతు భరోసా సహాయాన్ని కౌలు రైతులకు కూడా అందించాలన్నారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన ఈ హామీని మొదటి సంవత్సరంలోనే అమలు చేయాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. పబ్లిక్ హియరింగ్ లో కౌలు రైతులు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం నుంచి అంబాల లక్ష్మీ, మంచిర్యాల జిల్లా నుంచి ఆదివాసీ రైతు ముతి రాజేందర్, ఆసిఫాబాద్ జిల్లా నుంచి బండి మల్లేష్, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పాసుల నర్సింహులు, ఆదిలాబాద్ జిల్లా నుంచి రాసం నర్సింగ్, తొండల పోశెట్టి తదితరులు మాట్లాడారు.