ప్రొఫెసర్ సమ్మయ్యకు ఏఎస్‌టీసీ లైఫ్ మెంబర్ అవార్డు

– పరిశోధన రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపు

హ‌న్మ‌కొండ, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 :  పరిశోధన రంగంలో విశిష్ట కృషి, విజ్ఞాన వ్యాప్తికి అందించిన అమూల్యమైన సేవలను గుర్తిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ గాదె సమ్మయ్యకు ప్రతిష్ఠాత్మక ఏఎస్‌టీసీ లైఫ్ మెంబర్ అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని సిఎస్‌ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్ఐ)లో శుక్రవారం నిర్వహించిన అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ వార్షిక మహాసభ–2026 సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు.  భారత ప్రభుత్వ రంగ సంస్థ ‘మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్’ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.వి.ఎస్.నారాయణమూర్తి చేతుల మీదుగా ప్రొఫెసర్ సమ్మయ్య ఈ అవార్డును అందుకున్నారు. ఈ సదస్సుకు భారత ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ టి. శ్రీనివాస కుమార్ తోపాటు సీఎస్ఐఆర్-ఎన్‌జీ ఆర్‌ఐ  డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్‌.సి. మోహన్ రావుతో పాటు దేశంలోని పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి, పరిశోధనలకు ప్రొఫెసర్ గాదే సమ్మ య్య ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి ఈ అవార్డు వరించడం పట్ల కేయూ తోటి అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, పలువురు శాస్త్రవేత్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *