విద్యా, పరిశోధనా రంగాల్లో విశేష సేవలు

డాక్టర్ రోహిణికి ఏఎస్ టీసీ లైఫ్ మెంబర్ అవార్డు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబ‌ర్ 30 : విద్యా, పరిశోధనా రంగాల్లో విశేష సేవలందిస్తున్న విద్యా జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీజేఐటీ) హ్యూమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగం కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రోహిణి రొండ్ల ప్రతిష్ఠాత్మక అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్‌టీసీ) లైఫ్ మెంబర్‌షిప్‌ (ASTC Life Member Award  కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం నిర్వహించిన ఏఎస్‌టీసీ వార్షిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆమెకు ఈ లైఫ్ మెంబర్‌షిప్ ధ్రువపత్రాన్ని ప్రదానం చేశారు. ఏఎస్‌టీసీ, సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్ఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ టి. శ్రీనివాస కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పురస్కారాన్ని అందజేశారు.

డాక్టర్ రోహిణి రొండ్ల ప్రస్థానం:

బోధన, పరిశోధనా రంగాల్లో 25 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన డాక్టర్ రోహిణి అంతర్జాతీయ పరిశోధనా పత్రికల్లో సుమారు 50 పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. ఆమె హెచ్‌-ఇండెక్స్ 19, ఐ10-ఇండెక్స్ 25గా ఉన్నాయి. గతంలో బెస్ట్ ఉమెన్ రీసెర్చర్, బెస్ట్ ప్రెజెంటర్ అవార్డులు అందుకున్న ఆమె, 2024లో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అసోసియేట్ ఫెలోషిప్‌ను సైతం పొందారు. తాజాగా లభించిన ఏఎస్‌టీసీ లైఫ్ మెంబర్‌షిప్ ఆమె కృషికి మరో నిదర్శనంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *