చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు

– చైనా తీరుపై ట్రంప్‌ అసహనం

వాషింగ్టన్‌,‌ జూలై 30 : అమెరికా విమానాలు, హెలికాప్టర్లకు తలనొప్పిగా మారిన కొన్ని ఆయుధాలను చైనా నుంచి ఇరాన్‌ ‌కు సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటి రవాణాకు పాకిస్థాన్‌ను మార్గంగా ఎంచుకొన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ సంచలన కథనం ప్రచురించింది. దీంతో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ‌స్పందించారు. పాక్‌ ‌పేరు ఎత్తకుండా చైనాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా ఆయుధాల సరఫరా విషయం తెలుసుకొని తాను నిరాశకు గురైనట్లు పేర్కొన్నారు. తాము ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించ బోమని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ‌స్వయంగా తనకు హా ఇచ్చినట్లు పేర్కొన్నారు. చైనా, రష్యాల నుంచి ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయవద్దని గత వారం ట్రంప్‌ ‌హెచ్చరికలు కూడా జారీ చేశారు. చైనా నుంచి దాదాపు 60 మిలియన్‌ ‌డాలర్లకు పైగా విలువైన 400 షోల్డ‌ర్ ఎయిర్‌ ‌డిఫెన్స్ ‌వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. వీటితో తమ గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరాన్‌ ‌భావిస్తోంది. అయితే.. ఈ డీల్‌కు టెహ్రాన్‌ ‌పక్షాన హాంకాంగ్‌ ‌చెందిన ఝాంగ్‌కింగ్‌ ‌బావోషాంగ్‌ ఇం‌టర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌మధ్యవర్తిగా ఉంది. ఈ క్షిపణులను ఉత్తర చైనా నుంచి పాకిస్థాన్‌ ‌దుగా ఇరాన్‌లోకి చేర్చాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కాకపోతే వీటిని భూమార్గంలో తరలిస్తారా.. గగనతలంలో తీసుకెళతారా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే ఈ కథనాలను చైనా కొట్టిపారేయడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ఈ అం‌శంపై స్పందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *