ఎస్‌ఐఆర్‌తో పథకాలకు సంబంధం లేదు

– ప్రజలు అనవసర అపోహలకు గురి కావద్దు
– ఎన్నికల అధికారి సుదర్శన్‌ ‌రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 30: రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ‌పక్రియలో భాగంగా చేపడుతున్న వోటరు జాబితా సవరణకు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.ఎస్‌ఐఆర్‌ ‌పక్రియ పురోగతిపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్లతో ఎస్‌ఐఆర్‌ ‌పక్రియలో భాగంగా డిజిటలైజేషన్‌ ‌పై వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా సక్షించారు. ఈ సందర్భంగా సిఇఓ మాట్లాడుతూ కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ‌పక్రియ కేవలం తప్పులు లేని వోటరు జాబితా రూపకల్పనకు మాత్రమేనని, ప్రభుత్వం పథకాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఎన్యూమరేషన్‌ ‌ఫారాలను సమర్పించేందుకు మరో నాలుగు రోజులు గడువు మాత్రమే ఉన్నందున ఆగస్టు మూడవ తేదీలోగా డిజిటలైజేషన్‌ ‌పక్రియ 100శాతం పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76శాతం  డిజిటలైజేషన్‌ ‌పక్రియ పూర్తయిందని, గ్రామీణ ప్రాంతాల్లో 90శాతం పూర్తయిందని, ఇందులో ఖానాపూర్‌, ‌బాల్కొండ, ఎల్లారెడ్డి, హజూర్‌ ‌నగర్‌, ‌నర్సంపేట్‌, ‌వర్ధన్నపేట్‌, ‌పరకాల, బోద్‌ ‌నియోజకవర్గాల్లో 100శాతం డిజిటలైజేషన్‌ ‌పూర్తయిందని, ఇందుకు సంబంధించిన అధికారులను సిఇఒ ప్రశంసించారు. శేరిలింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్‌, ‌జిహెచ్‌ఎం‌సితో పాటు నిజామాబాద్‌, ‌వరంగల్‌, ‌ఖమ్మం  పట్టణ ప్రాంతాలలో డిజిటలైజేషన్‌ ‌పక్రియపై సంబంధిత డిఇఒలు ప్రత్యేక దృష్టి సారించి డిజిటలైజేషన్‌ ‌పక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఎన్యూమరేషన్‌ ‌ఫారాలను డిజటలైజేషన్‌ ‌చేయడంలో వోటరు పేర్లను తప్పులు లేకుండా అప్‌ ‌లోడ్‌  ‌చేసేలా బిఎల్‌ఒలు, సూపర్‌ ‌వైజర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇఆర్‌ఒ, ఎఇఆర్‌ఒలుదీనిపై సక్షించి తప్పులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. డిజిటలైజేషన్‌ ‌లో నిర్లక్ష్యం వహించిన బిఎల్‌ఒలు, సూపర్‌ ‌వైజర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఇఒ హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్‌ ‌స్టేషన్ల రాష్నాలైజేషన్‌ ‌పక్రియను  వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఒకే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే పోలింగ్‌ ‌కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు. ఓటర్లలో మరణించిన వారు, ఇల్లు మరిన వారి వివరాలు, అందుబాటులో లేని వారి జాబితాను సిద్ధంచేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బిఎల్‌ఎల సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఇఆర్‌ఒ, ఎఇఆర్‌ఒ, ‌బిఎల్‌ఒ ‌స్థాయిలలో జరిగే  రాజకీయ పార్టీల సమావేశాలను వీడియోగ్రాప్‌ ‌చేసి డాక్యుమెంట్‌ ‌చేయాలన్నారు. దాంతోపాటు విఐపి, వివిఐపిల ఓటర్లను గుర్తించి  మ్యాపింగ్‌ ‌చేయాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *