– శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి ఈడీ సమన్లు
– సాహితి ఇన్‌ఫ్రాటెక్ మనీ లాండరింగ్ కేసులో..
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. కంపెనీకి చెందిన సుమారు రూ.2.1 కోట్ల నిధులు ఆయన బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించినట్లు గుర్తించడమే ఇందుకు కారణం. సోమవారం తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈ లావాదేవీల గురించి ఆయన్ని ప్రశ్నించడంతో పాటు కంపెనీ నుంచి అందిన డబ్బుకు సంబంధించి వివరణ కోరే అవకాశం ఉంది. ఇళ్ల కొనుగోలుదారుల నుంచి సాహితీ ఇన్‌ఫ్రా సేకరించిన నిధులను దారి మళ్లించారన్న ఆరోపణలపై ఈడీ చేపట్టిన విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ సమన్లు జారీ అయ్యాయి. కొనుగోలుదారుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కంపెనీ, దాని మేనేజింగ్ డైరెక్టర్ బి.లక్ష్మీనారాయణ ఇతరులపై నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తును చేపట్టింది. లక్ష్మీనారాయణను 2024లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఫ్రీ లాంచ్ పేరుతో కొనుగోలుదారుల నుంచి నగదు వసూలు చేసినట్లు, ఈ నిధులను కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు గాంధీపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో రూ.161 కోట్ల విలువైన ఆస్తులను, మరో విడతలో రూ.12.6 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇప్పటివరకు 56 బ్యాంకు ఖాతాలను అధికారులు సీజ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





