– స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
– దీపావళి పండుగ వేళ పెరుగుతున్న కొనుగోళ్లు
– ఆఫర్లు, జీరో మేకింగ్ ఛార్జీలతో వినియోగదారులను ఆకర్షిస్తున్న దుకాణాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2: ఇటీవల రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులకు మళ్లీ ధరల షాక్ తగిలింది. సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీపావళి పండుగ సమీపిస్తుండటంతో బంగా రు ఆభరణాల కొనుగోలుకు ప్రజలు. తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో అమ్మకాలను పెంచుకునేం దుకు నగల దుకాణాల యజమానులు జీరో మేకింగ్ ఛార్జీలు, లక్కీ డ్రాలు, ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా డాలర్ బలోపేతం కావడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాలు బంగారం ధరల కదలికలకు ప్రధాన కార ణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ప్రారంభం. నుంచి పసిడి ధరలు భారీగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
హైదరాబాద్ /విజయవాడ విశాఖపట్నం:
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.1,39,370 (రూ.490 పెరిగింది).
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.1,27, 750 (రూ.450 పెరిగింది)
న్యూదిల్లీలో : 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ. 1,39,520, 22 10: 2, 1,27,900
చెన్నై / బెంగళూరు : 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ.1,39,370
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





