– నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్లు
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నాలా రుసుము చెల్లింపుతో అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం అయింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. మెమో నెం.48062/యÖఎల్‌సీ/ఎ/1/2026 ద్వారా అర్హత ఉన్న దరఖాస్తులను కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. 22-ఎ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో వేగం పుంజుకుంది. ఇప్పటికే ప్రభుత్వం ఐదు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, జీవో 118, జీవో 76లకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ. జీహెచఎంసీ, హెచఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు ఉన్న 22ఎ ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి లభించింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సి దరఖాస్తుల పరిష్కారానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపింది. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని, 22-ఎ సమస్యల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ´ చేయాలని రెవెన్యూ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





