సర్వ సంపదలు చేకూరాలి

– రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు చీకట్లను తొలగించుకుని జ్ఞానకాంతులను ఆహ్వానించాలనే సందేశాన్ని దీపావళి పండుగ మనకు అందిస్తున్నదని తెలిపారు. దీపావళి ప్రత్యేక సాంప్రదాయం, బాణాసంచా కాల్చే సందర్భంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులందరూ పండుగ సంబురాలు జ‌రుపుకోవాలని కేసీఆర్ కోరారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగి సర్వ సంపదలు చేకూరేలా, రాష్ట్రం తిరిగి ప్రగతి పథంలో పయనించేలా లక్ష్మీదేవి అమ్మవారు కరుణాకటాక్షాలు అందించాలని ప్రార్థించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *