– సీఎం రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల జీవితాల్లోని చీకట్లను తొలగించి, వారి బతుకుల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందన్నారు. దీపాల వెలుగులతో ఇళ్లను, పరిసరాలను అలంకరించుకుని ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీపావళి కాంతులు ప్రతి ఇంటా సుఖసంతోషాలను నింపాలని, ప్రజల జీవితాలు ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, శాంతిసౌభాగ్యాలతో వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పండుగ సంబరాల వేళ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కాలుష్యానికి తావులేకుండా, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నారులు, పెద్దలు సురక్షిత వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





