ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి

– ఉప ముఖ్యమంత్రి భట్టి దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. దీపాల వెలుగులు చీకట్లను తొలగించినట్లే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశలు, ఆశయాలు, అభివృద్ధి, ప్రగతి కొత్త కాంతులను నింపాలని ఆకాంక్షించారు. సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక భరోసా, ప్రతి రంగంలో అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
దీపావళి వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కాలుష్యరహిత దీపావళిని జరుపుకోవాలని, బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *