మతోన్మాదపు ఉచ్చులో,
మానవత్వం మంట కలిసెను.
గో రక్షణ రొంపిలో,
మురికి పట్టిన మనసులాయెను
ఏ దైవం పంపెనో,
ఈ రాక్షస రాజులను!
ఏ మతం పెంచెనో,
ఈ ఉన్మాద ఉద్దండులను!
కులమంటూ మతమంటూ గీతల్ని గీస్కుంటూ,
చెలరేగు మూకల్లే మౌఢ్యాలు విలసిల్లు!
ఎందులకు కాణాచిరా ఈ భూమి?
ఎందులకు మొగసాలరా ఈ పృథ్వి?
– బాలాజీ పోతుల
8179283830





