త్యాగానికి మారు పేరు ఏసు ప్రభువు..!

సెక్రటేరియట్ క్రిస్మస్ వేడుకల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంప్రభాకర్ 

హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్13: లోక కల్యాణం కోసం అందరూ యేసు ప్రభువుకు ప్రార్థనలు చెయ్యాలని. ప్రజల క్షేమంకొరకు ఏసు ప్రభువు కీర్తనలు, ప్రవచనలు, ఆలోచనలతో ముందుకు పోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్యాగానికి మారుపేరైన యేసు క్రీస్తు సమాజంలో క్షమాగుణం అందరు కలిగి ఉండాలని మంత్రి అన్నారు.

సంవత్సరానికి ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా జరిగే పెద్ద పండగ క్రిస్మస్ అని సమాజములో అందరు బాగుండాలని ఆకాంక్షించారు. ఉద్యోగులుగా అంకిత భావంతో పనిచేయాలని, పేదప్రజలకు సేవలందించాలని, వారికీ న్యాయం జరిగేటట్టు చూడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూలర్ భావాలతో అన్ని మతాలను గౌరవిస్తుందని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆశీర్వచనం ఇస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసిన బ్రదర్ అనిల్

శుక్రవారం నాడు డా బి. ఆర్. అంబెడ్కర్ తెలంగాణ సచివాలయం లో క్రిస్టియన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సచివాలయం చర్చి లో గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిధి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ శుభ క్రిస్టమస్ సందర్బంగా రైతులు పాడి పంటలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అన్నారు.

ముఖ్యవక్త గా విచ్చేసిన దైవజనులు బ్రదర్ అనిల్ కుమార్ దైవ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాపులను క్షమించదని యేసు ఈ లోకానికి వచ్చాడని అన్నారు. ఈ సందర్బంగా ఏఐసీసీ మైనారిటీ నాయకుడు అనిల్ థామస్, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ , మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ లూక్ క్రిస్మస్, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి సబితా కేక్ కట్ చేసారు. ఎంప్లాయిస్ క్వయిర్ బృందం ప్రత్యేక పాటలు వినిపించారు.

ఈ కార్యక్రమమునకు క్రిస్టియన్ ఎంప్లాయిస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ చిట్టి బాబు అధ్యక్షత వహించాడు. చైర్మన్ లాల్ బహదూర్ శాస్ట్రీ, సువర్ణ రాజు, విక్రమ్, శశిభూషణ్, విప్లవ్, మనోహరమ్మ, జేకబ్ రాస్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *