కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా 6 గ్యారంటీల అమలు ఎలా..?

  • ముందు తెల్ల కార్డులు ఇవ్వాలి
  • బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌

కరీంనగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హావిూలను అమలు కోసం దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. అయితే తెల్ల రేషన్‌ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడం పట్ల సందేహం వ్యక్తం చేశారు. కొత్తగా రేషన్‌ కార్డులు ఇవ్వకుండా పేదలకు ఎలా న్యాయం చేస్తారని అన్నారు. కరీంనగర్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్‌ 6 హావిూలకు దరఖాస్తులు సరే.. కొత్త రేషన్‌ కార్డులేవని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. ఇంకా లక్షలాది మంది రేషన్‌ కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు రెడీగా ఉన్నరు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణమే కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలి. 6 గ్యారెంటీల హావిూలను వారికి సైతం వర్తింపజేయాలని బండి సంజయ్‌ అన్నారు. రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించేందుకు అన్ని పార్టీలను భాగస్వాములను చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 6 గ్యారెంటీల అమలుకు నిధులెలా సమకూరుస్తరని ప్రశ్నించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గ్టటెక్కిస్తారో సమాధానం చెప్పాలన్నారు.

ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్‌ జమాతేకు నిధులెట్లా ఇస్తరని ప్రశ్నించారు. గతంతో కోవిడ్‌  మహమ్మారి ప్రబలడానికి తబ్లిక్‌ జామాతే కారణం. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేంటి? ప్రభుత్వం తక్షణమే నిధులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంస్థలను ప్రోత్సహిస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడిరచినా కేటీఆర్‌ అహంకారం తగ్గలేదని, ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భ్రమల్లో ఉంటూ మాట్లాడుతున్నడని,. 50 లక్షల కోట్ల సంపద సృష్టిస్తే.. ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేదని, భూములు ఎందుకు అమ్మాల్సి వొచ్చిందని, దళిత బంధు అందరికీ ఎందుకు ఇవ్వలేదని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీదారు కానేకాదని, వారి డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యమని సంజయ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *