24 గంటల విద్యుత్ ఎక్కడ?

– ప‌దిన్న‌ర‌ గంటలే త్రీఫేజ్ కరెంటు
– రైతుల విద్యుత్ సమస్యలపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం

సిద్దిపేట, ప్రజాతంత్ర ఆగస్టు 6 : రైతుల కు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సర ఫరా చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్ విద్యుత్ సబస్టేషన్ను గురువారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన, లాగబ్బుక్ను పరిశీ లించిన అనంతరం మీడియాతో మాట్లా డారు. లాగ్బుక్లో నమోదైన వివరాల ప్రకారం రాఘవాపూర్ గ్రామంలో రైతు లకు రోజుకు కేవలం 10 గంటల 30 నిమిషాల పాటు మాత్రమే త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో రైతులకు నాణ్యమైన 24 గం టల విద్యుత్ అందేదని, ప్రస్తుతం ఆ పరి స్థితి లేదన్నారు. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్కు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తగిన నీరు అందక చెరువులు ఎండిపోతున్నాయని, రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ను పరిమిత సమయానికే ఇస్తున్నారని ఆయన ఆరో పించారు. రైతుల కొత్త విద్యుత్ కనెక్షన్ల విషయంలో కూడా తీవ్ర జాప్యం జరు గుతోందని ఆరోపించిన హరీష్ రావు, సిద్దిపేట ప్రాంతంలో సుమారు వెయ్యి మంది రైతులు దరఖాస్తులు చేసి నిర్ణీత రుసుము చెల్లించినప్పటికీ ట్రాన్స్ ఫార్మ ర్లు, అవసరమైన విద్యుత్ సామగ్రి అం దడం లేదని చెప్పారు. గతంలో రూ. 4,900 డీడీతో అందించిన సదుపాయా లకు ఇప్పుడు దాదాపు రూ.10 వేల వర కు వసూలు చేస్తున్నారని, అయినప్పటికీ అవసరమైన మెటీరియల్ ఇవ్వడం లేదని విమర్శించారు. సిద్దిపేట స్టోర్లో ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా సిద్ధంగా లేదని ఆయన పేర్కొన్నారు. తాను మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనమని అన్నారు. రైతులకు నాణ్య మైన 24 గంటల విద్యుత్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *