– ఉచిత సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
కూసుమంచి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రతి లబ్దిదారుడికి ప్రతినెలా 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వర మాదారం గ్రామంలోని చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ తో కలిసి లబ్దిదారులకు మూడు నెలల ఉచిత సన్న బియ్యాన్ని మంత్రి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యాన్ని
అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని ప్రజలు వినియోగించకుండా విక్రయించడం లేదా రీసైక్లింగ్ అక్ర మాలకు గురికావడంతో ప్రభుత్వ ధనం వృథా అయ్యేదని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం ఎంతో నాణ్యంగా ఉండటంతో లబ్దిదారులే స్వయంగా వండుకుని తింటున్నారన్నారు. రేషన్ దుకాణాల్లో ఒక్క గింజ తక్కువ వచ్చినా డీలర్లను ప్ర శ్నించే స్థాయికి ప్రజల్లో చైతన్యం రావడం శుభపరిణామమని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. కూసుమంచి మండలంలో గురువారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలిసి మంత్రి పొంగులేటి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రూ.6.74 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాజుపేట బజార్ గ్రామం వద్ద ఈశ్వర మాదారం నుంచి భద్రుతండా వరకు రూ.1.76 కోట్లతో, తాళ్లగడ్డ తండా వరకు రూ.50 లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణా నికి మంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం చౌటుపల్లి లో రూ.3.20 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ వంతెనకు, లింగారం తండాలో రూ.1.28 కోట్లతో చేపట్టనున్న ఆర్అండ్ బీ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. లింగారంలోనే రూ.5.45 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తండాలో మంత్రి పొంగులేటి స్వయంగా పొలంలోకి దిగి దుక్కి దున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, పీఆర్ ఎస్ఈ వెంకట్రెడ్డి, డీవైఎస్వో సునీల్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





