– బీజేపీ నేత ఏలేటి ఆరోపణలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు శాఖల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అందినంత దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు, యంగ్ ఇండియా పాఠశాలలు, సింగరేణి, సివిల్ సప్లైస్ శాఖల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంట్రాక్టుల్లో ఎక్కువ భాగం ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని, వారు చిన్న కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చి అధిక కమీషన్లు పొందుతున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టులో కీలక పదవులకు గత బీఆరఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులను నియమించడం కాంగ్రెస్-బీఆరఎస్ అవగాహనకు నిదర్శనమన్నారు. 22ఏ భూముల వ్యవహారంలో ప్రైవేట్ భూముల యజమానులను ఇబ్బందులకు గురిచేస్తూ కమీషన్లు వసూలు చేస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సింగరేణి నియామకాలు, ధాన్యం మాయమైన ఘటనలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, బినామీ కంపెనీల లావాదేవీలపై బీజేపీ అధ్యయనం చేస్తోందని, త్వరలో ఆధారాలతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




