రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయాల్లో సర్వర్ల మొరాయింపు

నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 :  తెలంగాణ వ్యాప్తంగా రిజిస్టేష్రన్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా సేవల్లో అంతరాయం కలుగుతున్నది. ఆధార్‌ ‌లింక్‌ ‌కాకపోవడంతో కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి. యూడీఐఏలో ఈకేవైసీలో వెరిఫికేషన్‌ ‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. రిజిస్టేష్రన్ల కోసం వచ్చిన జనం కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు.

ఇండ్లు, ప్లాట్ల క్రయ విక్రయాల కోసం స్లాట్‌ ‌చేసుకున్న వారంతా సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించారు. గురువారం స్లాట్‌ ‌బుక్‌ ‌చేసుకున్న రిజిస్టేష్రన్లు శుక్రవారం పూర్తి చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా 140 సబ్‌ ‌రిజిస్ట్రా ‌కార్యాలయాల్లో రిజిస్టేష్రన్లు నిలిచిపోయాయి. వాస్తవానికి ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా 5వేల నుంచి 7వేల రిజిస్టేష్రన్లు జరుగుతుంటాయి. దీంతో రూ.60కోట్ల నుంచి రూ.70కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. గతంలో ఇదే తరహాలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *