-ఎంకే గ్యాంగ్ కార్యకలాపాలపై ఉక్కు పాదం
– నలుగురు గ్యాంగ్ సభ్యులు పరార్.
– డి.ఎస్.పి రవీంద్రారెడ్డి వెల్లడి
మణుగూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఈనెల 27న నేతాజీ గ్రౌండ్స్ లో జరిగిన సింహాద్రి శివకుమార్ హత్య కేసులో 27 మంది ఎంకే గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి సోమవారం కోర్టుకి రిమాండ్ చేసినట్టు మణుగూరు డీఎస్పీ రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సింహాద్రి శివకుమార్ గత నాలుగేళ్ల నుంచి హైదరాబాద్లో ఇంటీరియల్ డిజైన్ వర్క్ చేస్తున్నాడు. మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ చెందిన బుల్లి హర్ష,, సుందరయ్య నగర్ కి చెందిన కర్రీ సతీష్ అనే వ్యక్తులు శివకుమార్ వద్ద పనిచేస్తున్నారు. కాగా అదే గాంధీబొమ్మ సెంటర్ చెందిన లోకేష్ చదువు నిమిత్తం హైదరాబాద్లో ఉంటూ మద్యానికి బాసినసయ్యాడు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం సతీష్ కు ఫోన్ చేసి మీ చెల్లి విషయంలో బెదిరింపులకు పాల్పడ్డాడు. పాత గొడవలు మనసులో పెట్టుకుని ఫోన్లో తరచూ దూషిస్తూ ఉండేవాడు. ఈ విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరగగా, లోకేష్ సతీష్ ని ఓ సందర్భంలో దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో శివ అడ్డుపడి గొడవను ఆపాడు. ఈ విషయంలో లోకేష్ కి ఎంకే గ్యాంగ్ లీడర్ జట్పట్ అలియాస్ రమ్మీ, అలియాస్ జెట్టికి చెప్పగా నాలుగైదు రోజుల నుంచి జెట్టి సతీష్ కు ఫోన్ చేసి శివ ఎప్పుడు మణుగూరుకు వస్తే దాడి చేస్తానని బెదిరించినట్లు డీఎస్‌పీ వివరించారు. 26న మధ్యాహ్నం సతీష్, బన్నీ ఇంటీరియల్ పనులు చేస్తుండగా జట్టి సతీష్ కు ఫోన్ చేసి రాఖీ పండుగకు వస్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తూ ఫోన్లో మాట్లాడుతుండగా పక్కనే ఉన్న శివకుమార్ ఫోన్ తీసుకొని మేము పనిలో ఉన్నాము మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని ఫోన్ పెట్టేసాడని డీఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో జెట్టి శివకుమార్ కి ఫోన్ చేసి అతడిని చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు. 27న ఉదయం 7 గంటలకు శివకుమార్ హైదరాబాద్ నుంచి మణుగూరు వచ్చి ఇంటి పక్కన ఉన్న ఉదయ్ కుమార్ ను తీసుకొని బైక్ పై ఉదయం 11 గంటల ప్రాంతంలో నేతాజీ గ్రౌండ్స్ కి వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న సాధిక్, వినయ్, దినేష్, జంపయ్యలు శివకుమార్‌పై మూకుముడిగా దాడి చేసి కొట్టి ప్రాణాలు తీశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై 89(2),103(2),109(1),351(3),
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



