ఇద్దరిని బలిగొన్న వేప చెట్టు వివాదం

– గొడ్డళ్లతో నరుక్కున్న ఇరువర్గాలు
– అడ్డుకోబోయిన ఎస్ఐకి తీవ్ర గాయాలు

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: సూర్యాపేట జిల్లాలో ఓ చిన్న వివాదం పెద్దదిగా మారి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నది. మేళ్ల చెరువు మండలం ఎర్రగడ్డతండాలో ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు విషయమై రెండు వర్గాల మధ్య చిచ్చు రేగింది. మాటామాటా పెరిగి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఇరు వర్గాలు విచక్షణ కోల్పోయి ఏకంగా గొడ్డళ్లతో పరస్పరం దాడులకు తెగబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో ఒకరిపై ఒకరు వేసుకున్న గొడ్డలి వేట్లకు ఇద్దరు వ్యక్తులు రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఘర్షణను అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన మేళ్ల చెరువు ఎస్ఐ నవీన్ కుమార్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఓ చిన్న చెట్టు వివాదం ఇద్దరి ప్రాణాలు తీయడంతోపాటు పోలీసులకే గాయాలయ్యే స్థాయికి వెళ్లడంతో ఎర్రగడ్డతండాలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *