– ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : నీట్ పీజి పరీక్షకు ఒకరోజు ముందు నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాద ఘటన జరిగింది. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని అపరాజిత హాస్టల్‌లో ఉంటూ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యువతి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం నీట్ పీజీ పరీక్ష అనగా.. మనస్తాపంతో కర్నూలుకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత ప్రాణాలు తీసుకుంది. గత ఆరు నెలలుగా యువతి హైదరాబాద్‌లో ఉంటూ ’నీట్ పీజీ’ పరీక్షకు ప్రిపేర్ అవుతోంది. మృతురాలు కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వహాస్పిటల్‌కి తరలించారు. విద్యార్థిని మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒక్కగానొక్క కూతురు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరీక్షల మానసిక ఒత్తిడే యువతి ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు