కొత్త కారు ప్రారంభంలో విషాదం

– అదుపుతప్పి మామపైకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ‌కొత్త కారు కొన్న ఓ కుటుంబం సంతోషం నిమిషాల వ్యవధిలోనే విషాదంగా మారింది. కారుకు పూజ చేయించేందుకు అల్లుడితోపాటు గుడికి వెళ్లిన మామ.. అదే కారు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. నగరానికి చెందిన ఓ దంపతులు ఇటీవల కొత్త కారును కొనుగోలు చేశారు. దానికి పూజ చేయించేందుకు మామయ్య రామచంద్రరావును ఆహ్వానించారు. దీంతో అల్లుడు, కుమార్తెతో కలిసి పెద్దమ్మగుడికి వెళ్లారు. అల్లుడు కారును డ్రైవ్‌ ‌చేస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి రామచంద్రరావు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *