Day November 19, 2026

పిల్లలకు నీటి పాఠాలు ..!

నీటిని పొదుపుగా వాడుకోవాలని పాఠశాల విద్యార్థులకు బోధించడం మంచి నిర్ణయమే. కానీ నీటి కొరతను ఎదుర్కొనే బాధ్యతను ప్రజల వ్యక్తిగత అలవాట్లకే పరిమితం చేస్తే అసలు సమస్య పరిష్కారం కాదు. తెలంగాణలో వర్షపాతం లోటు, జలాశయాల్లో తగ్గుతున్న నిల్వలు, రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాపై నెలకొంటున్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు సరిపోతాయన్నది…

బాల్యం భద్రమేనా?!….

“ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఒక్కసారి మనం మన పిల్లల ప్రపంచం లోకి వెళ్దాం… వాళ్లతో పాటు కింద కూర్చుందాం….వాళ్ళ కళ్ళతో ఈ లోకాన్ని చూద్దాం…. అప్పుడు తెలుస్తుంది, మనం వాళ్లకు ఏం పోగొట్టామో… పిల్లల ప్రపంచం ఇంకా సజీవంగా ఉంది , అది మన కోసం ఎదురుచూస్తున్నది , రండి… ఆ ప్రపంచంలోకి వెళ్దాం…

మహాభారత గాథలతో ముడిపడిన భీమన్న సంప్రదాయం.. వెలుగులోకి రావాల్సిన నాయకపోడుల చరిత్ర!

“ఆదివాసీ అస్తిత్వానికి ప్రతీకగా భీమన్న ఆరాధన.. గాంధారి ఖిల్లా చారిత్రక ఆనవాళ్ల నుంచి పూర్వీకుల వంశగాథల వరకు వెలికితీయాల్సిన మరుగునపడిన చరిత్ర.. నాయకపోడుల సంస్కృతి, సంప్రదాయాలు, భాష, వారసత్వ పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక పరిశోధనలు చేపట్టాలి!” పాండవుల నుంచి భీమన్న వరకు.. తరతరాలుగా కొనసాగుతున్న నాయకపోడుల విశ్వాసాలు, వారసత్వం! భారతీయ చరిత్రలో మహాభారతం కేవలం ఒక…

ఎందుకైనా మంచిది-జనజ్వాల

వెన్నెల కోసం అరులు చాచిన ఓ చెలికాడ, ఎందుకైనా మంచిది ఓ చిరునవ్వు వాడిపోకుండా పెదవుల లోపల, ఊట బావిలా దాచుకో   కత్తుల్లాంటి నవ్వులతో కనిపిస్తుంటాడు కత్తుల్లాంటి చూపులతో కబళిస్తుంటాడు శత్రువు వాడి దినచర్య అదే   నీవేమో వెన్నెల, వెన్నెలపై వాలే చిరుగాలి కోసం ఎందుకైనా మంచిది

సూనృతం -బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు “ఆ రోజు అమావాస్య. అయినా అంతవరకూ కమ్మిన చీకటి చీకట్లో కలిసిపోయింది. ఎందుకంటే, నిండు చంద్రుడు ఆకాశంలోకి వచ్చేశాడు, యెందుకు? వెన్నల వర్షం కురిపిస్తున్నాడు, యెందుకు?” అడిగాడు మిత్రుడు. “ఎందుకూ? నువ్వు కవివయినా కావాలి. లేదంటే మధువు అయినా సేవించి వుండాలి” అన్నాను, తన గొంతు యెండిపోవడం పసిగట్టి. “మధువు… చూడు ‘వధువు’లాగ,…

చరిత్ర తిరగరాసిన, దళిత స్త్రీవాద స్వరం

కొన్నిరచనలు అక్షరాలుగా జీవితాన్ని వర్ణిస్తాయి. మరికొన్ని జీవితంలో దాగిన అన్యాయాన్ని బయటపెడతాయి. ఇంకొన్నేమో చరిత్రలో ఎవరికీ కనిపించకుండా వినిపించకుండా మిగిలిపోయిన మనుషుల ఊసును ఉనికిని తిరిగి నమోదు చేస్తాయి. జూపాక సుభద్ర రచనల్లో ఈ మూడూ కనిపిస్తాయి. ఆమె కవిత్వాన్ని చదివినా కథల్లోకి ప్రవేశించినా పాఠకుడికి ఎదురయ్యేది కేవలం సాహిత్య సౌందర్యం కాదు. తరతరాలుగా శ్రమిస్తూ,…

నడిపోడు(కథ)

“కేసుపాలయి జైలుకు పోతిరి. తెలంగాణ తెస్తిరి. ఏబీసీడీలు తెచ్చుకుంటిరి. గిన్ని ఉద్దెమాలు జేత్తరి. ఇంకెప్పుడు ? కొడకా! నీ కష్టాల ఆకలి తీరేది” అంటూ నిరాశకు గురైండు సోమయ్య.  “నౌకరు జేశెటోళ్ళకు జీతం యాల్లకు అందకపాయే. సదువుకున్న పొలగాళ్ళకు కొలువులు రాకపాయే. మరి వోట్ల కోసం వచ్చే సదువురాని ఆ బందెల్లి గాళ్ళకు పెద్దపెద్ద మంత్రి పదవులు ఎందుకురా?”…

సిద్దిపేట జిల్లాలో రూ.544.11 కోట్లతో అభివృద్ధి ప‌నులు

– శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేసిన  సీఎం రేవంత్ సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 19 : సిద్దిపేట జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సిద్దిపేట , దుబ్బాక నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి ప‌నుల‌కు గురువారం శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. అనంత‌రం దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఇందిరమ్మ విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి…

హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలపండి

– సీఎం రేవంత్రెడ్డికి మంత్రి పొన్నం విజ్ఞప్తి సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 19: హుస్నాబాద్ను మళ్లీ కరీంనగర్ జిల్లాలో కలపాలని సీఎం రేవంత్ రెడ్డికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. గతంలో హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి…